twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tollywood Drugs Case సంచలనం.. అప్రూవర్‌గా మారిన డ్రగ్ పెడ్లర్.. 12 మంది ఇరుక్కున్నట్టే?

    |

    టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా చెప్పబడుతున్న కెల్విన్ అనే డ్రగ్ డీలర్ ఈడీ ముందు లొంగిపోయి, కీలక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బతో ఇప్పుడు సినీ తారలు అందరూ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అసలు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

    మళ్ళీ రంగంలోకి

    మళ్ళీ రంగంలోకి

    గత మూడేళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఎక్సైజ్ శాఖ కొన్నాళ్ళపాటు విచారణ జరిపి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఏర్పాటు చేసి ఈ విషయంలో నిజానిజాలు తేల్చే పనిలో పడింది. కానీ చివరికి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా రిపోర్ట్ సానుకూలంగానే రావడంతో వాళ్లందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఒక సంస్థ ఈ విషయం మీద కోర్టుకు వెళ్లింది. దీంతో మళ్ళీ ఈ విషయంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది.

    అప్పుడు సైలెన్స్ కానీ ఇప్పుడు

    అప్పుడు సైలెన్స్ కానీ ఇప్పుడు

    ఆరు నెలల క్రితం కెల్విన్ అనే డ్రగ్ డీలర్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేయగా, ఎక్సైజ్ అధికారుల ముందు నోరు విప్పని కెల్విన్ ఈడీ కేసులో మాత్రం లొంగిపోయినట్లు తెలుస్తోంది. అలాగే తన వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన సినీ తారల లిస్టు కూడా కెల్విన్ లీక్ చేశాడని ప్రచారం జరుగుతోంది. కెల్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిందని అంటున్నారు.

    చిక్కుల్లో తారలు

    చిక్కుల్లో తారలు

    ఇక అందుతున్న సమాచారం మేరకు కెల్విన్ అకౌంట్ లోకి భారీగా సినీ తారలు నిధులు కూడా బదిలీ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే కెల్విన్ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన ఈడీ అధికారులు కెల్విన్ అకౌంట్ ఆధారంగా అతని అకౌంట్లో డబ్బులు పంపిన కొందరు సినీ తారలు అకౌంట్లను ఫ్రీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి గతంలో విచారణ ఎదుర్కొన్న సినీ నటులు మాత్రమే కాక ఈ సారి రకుల్ ప్రీత్, రానా సహా మొత్తం 12 మందికి నోటీసులు జారీ చేశారు.

     సుదీర్ఘ విచారణ

    సుదీర్ఘ విచారణ

    అందులో భాగంగానే నిన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ఆఫీస్ లో విచారణకు కూడా హాజరయ్యారు. సుమారు ఏడున్నర గంటలకు పైగా ఆయన విచారణ లో పాల్గొన్నారు.. ఈ క్రమంలో బండ్ల గణేష్ కూడా ఈ డి ఆఫీస్ వద్దకు వెళ్లడంతో అక్కడ కలకలం రేగినట్టు అయింది. అసలు పూరి జగన్నాథ్ విచారణ సమయంలో అక్కడికి బండ్ల గణేష్ వెళ్లాడు ? అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డైరెక్టర్ గా పూరీ, నిర్మాత గా బండ్ల గణేష్ తీసిన పలు చిత్రాలు పై ఈడీ ఆరా తీసిందని ప్రచారం మొదలయింది.

    Recommended Video

    Awe Theatrical Trailer 'అ!' చిత్రం ట్రైల‌ర్
    బండ్లను కూడా

    బండ్లను కూడా

    పురీ కి బండ్ల గణేష్ కు మధ్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీసిందని, బ్యాంక్ స్టేట్మెంట్లు ఆధారంగా , బండ్ల గణేష్ ను ఈడీ విచారణకు పిలిచినట్లు ప్రచారం జరిగింది. గతంలో నిరాత్మ బండ్ల గణేష్, డైరెక్టర్ పూరీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలయిన టెంపర్, ఇద్దరమ్మాయిలతో మీద కూడా ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఉదయం నుంచి బ్యాంక్ స్టేట్మెంట్ లు ఆధారంగా పూరిని సుదీర్ఘంగా ఈడీ విచారించినట్టు ప్రచారం జరిగినా అదేమీ లేదని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. నాకు ఏమీ సంబంధం లేదని కేవలం పూరీ కోసమే ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.

    English summary
    Another sensational turn has come to light in the Tollywood drugs case. A drug dealer named Kelvin, who is said to be the culprit in the case, surrendered before the ED and apparently revealed key details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X