దృశ్యం2 సినిమాపై రూమర్లు.. వాటిని నమ్మకండి.. ఖండించిన దగ్గుబాటి వర్గాలు

మాలీవుడ్, టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న దృశ్యం2 చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రం కేవలం 47 రోజుల్లోనే షూటింగు పూర్తి చేసుకోవడం ఇటీవల కాలంలో ఓ రికార్డుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో నిరాడంబరంగా మొదలైంది. విక్టరీ వెంకటేష్ తన పార్ట్ షూటింగును ఏప్రిల్ 15వ తేదీన పూర్తి చేసుకొన్నారు.

అయితే కరోనావైరస్ పరిస్థితుల్లో థియేటర్లు మూతపడినందున దృశ్యం2 సినిమా ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారనే విషయం మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ డీల్‌ను ఆఫర్ చేసింది. సుమారు 45 కోట్ల రూపాయల డీల్‌ను నిర్మాతల ముందు పెట్టింది అనే వార్త వైరల్ అయింది.

Drushyam 2 OTT release: Daggubati Team condemns rumours

అయితే దృశ్యం2 మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందనే వార్తను టీమ్ దగ్గుబాటి ఖండించింది. అలాంటి రూమర్లను నమ్మవద్దు అంటూ ట్వీట్ చేసింది. దృశ్యం2 సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఎలాంటి నిర్ణయం జరుగలేదు. అలాంటిదేమైనా ఉన్న గానీ.. లేదా థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం అని తమ ట్వీట్‌లో పేర్కొన్నది.

దృశ్యం మూవీ నటీనటులు, సాంకేతిక వర్గాల విషయానికి వస్త.. వెంకటేశ్, మీనా, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, నదియా, నరేష్, పూర్ణ తదితరులు నటిస్తున్నారు.
కథ, దర్శకత్వం: జీతూ జోసెఫ్
నిర్మాతలు: డి సురేశ్ బాబు, ఆంటోని పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి
మ్యూజిక్: అనుప్ రూబెన్
సినిమాటోగ్రఫి: సతీష్ కురూప్
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X