టాలీవుడ్‌లో సెన్సేషనల్ కాంబో: సౌత్ సూపర్ స్టార్‌తో తెలుగు డైరెక్టర్ మూవీ
తెలుగు సినీ పరిశ్రమలో కొంత కాలంగా ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు రూపొందుతోన్నాయి. వీటి వల్ల మన సినిమా స్టామినా గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో మన హీరోలతో సినిమాలు చేయడానికి వేరే భాషలకు చెందిన దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. అలాగే, మన దర్శకులతో సినిమాలు చేయడానికి పక్క ఇండస్ట్రీలకు చెందిన హీరోలు సైతం రెడీ అనేస్తున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొన్ని కాంబోలు సెట్ అవుతోన్నాయి.

సౌత్ కాంబినేషన్‌లో భాగంగానే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో తెలుగు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి చేతులు కలిపాడు. వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్‌తో నిర్మాత నాగ వంశీ కలిసు ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు.

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి - మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే, సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను వచ్చే అక్టోబర్‌లో ప్రారంభించబోతున్నట్లు కూడా చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇద్దరు స్టార్లు కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.
దుల్కర్ సల్మాన్ పోయిన సంవత్సరం తెలుగులో నేరుగా 'సీతా రామం' అనే సినిమాను చేశాడు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే, వెంకీ అట్లూరి.. కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్‌తో 'సార్' అనే సినిమాను రూపొందించాడు. ఇది రెండు భాషల్లోనూ సూపర్ సక్సెస్ అయింది. ఈ జోష్‌తోనే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిశారు.


Click it and Unblock the Notifications











