Sita Ramam: టాలీవుడ్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్.. ప్రేమికులకు సూపర్ సర్‌ప్రైజ్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో పాత సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది స్టార్లు నటించిన క్లాసిక్ మూవీలను వాళ్ల వాళ్ల పుట్టినరోజులనో, మరో స్పెషల్ డేనో రీ రిలీజ్ చేశారు. వాటికి మంచి స్పందన రావడంతో ఇప్పుడు ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన 'సీతా రామం' మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు.
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రమే 'సీతా రామం'. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా 2022లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో రికార్డు వసూళ్లను, ఎన్నో అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమాను ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14వ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు కొన్ని పోస్టర్లను కూడా రిలీజ్ చేసింది.

దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే టాప్ హిట్లలో ఒకటిగా నిలిచిన 'సీతా రామం' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు వైజయంతీ మూవీస్ సంస్థతో పాటు కొందరు ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు, దీన్ని ఏకంగా 300లకు పైగా స్క్రీన్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే ఈ సినిమా ప్రింట్ వర్క్ కూడా మళ్లీ మొదలెట్టి పూర్తి చేసుకున్నారు. ఇక, ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రెండు రోజుల్లోనే విడుదల చేయబోతున్నారు. దీంతో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.
ఎమోషనల్ అండ్ లవ్ కాన్సెప్టుతో రూపొందిన 'సీతా రామం' సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు. ఈ సినిమాకు ఫుల్ రన్‌లో రూ. 45 కోట్లు వరకూ షేర్ వసూళ్లు వచ్చాయి. తద్వారా రూ. 25 కోట్లకు పైగానే లాభాలు సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











