శంకర్ దర్శత్వంలో క్రేజీ హీరో.. భారతీయుడు 2లో ఛాన్స్!
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రస్తుతం 2.ఓ చిత్ర విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తరువాత శంకర్ ఫోకస్ మొత్తం భారతీయుడు2 చిత్రంపై పడనుంది. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా భారతీయుడు 2 చిత్రం గురించి కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడట. మలయాళంలో క్రేజీ హీరోగా దూసుకుపోతున్న దుల్కర్ మంచి పాత్రలు వస్తే పరభాషల్లో కూడా నటిస్తున్నాడు. దుల్కర్ ఈ ఏడాది తెలుగులో మహానటి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది జనవరి నుంచి భారతీయుడు2 షూటింగ్ ప్రారంభం కానుంది. కమల్ హాసన్ సరసన అందాల చందమామ కాజల్ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. దాదాపు 22 ఏళ్ల క్రితం సంచలనాలు సృష్టించిన భారతీయుడు చిత్రానికి శంకర్ ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











