థగ్‌లైఫ్ డిజాస్టర్.. బతికిపోయిన యంగ్ హీరో.. గ్రేట్ ఎస్కేప్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్
కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో దాదాపు 38 ఏళ్ల తర్వాత తెరకెక్కిన థగ్‌లైఫ్ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత ఎలాగైనా థగ్‌లైఫ్‌తో హిట్ కొట్టాలని భావించిన కమల్ హాసన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. విడుదలకు ముందే భారీగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అటు వివాదాలతోనూ థగ్‌లైఫ్‌కు పాపులారిటీ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
వివాదాల్లో థగ్‌లైఫ్
త్రిష, అభిరామి, శింబు వంటి స్టార్స్‌ను పెట్టుకుని కమల్ హాసన్.. ఈ థగ్‌లైఫ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కథ, కథనాలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తొలి అర్ధగంట వరకు ఓకే కానీ తర్వాత తమ సహనాన్ని పరీక్షించారంటూ మండిపడుతున్నారు. ఏమంత విశేషం ఉందని ఈ కథకు కమల్ హాసన్ ఓకే చెప్పారని ట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు అభిరామితో లిప్‌లాక్, త్రిషతో కమల్ హాసన్ రొమాన్స్ చేయడంపై వివాదం రేగింది. ఇది చాలదన్నట్లు కన్నడ భాషపై నోటికొచ్చినట్లు మాట్లాడి కన్నడిగులతో వైరం తెచ్చుకున్నాడు కమల్ హాసన్. క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో కర్ణాటకలో థగ్‌లైఫ్‌ను రిలీజ్ చేయడానికి లేకుండా పోయింది.

బాక్సాఫీస్ వద్ద ఎదురీత
అటు బాక్సాఫీస్ పరంగానూ థగ్‌లైఫ్‌కు ట్రబుల్ తప్పడం లేదు. రూ.40 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వస్తాయని భావించినప్పటికీ కేవలం రూ.25 కోట్ల లోపే చాపచుట్టేసింది. ఇక రెండో రోజు కలెక్షన్స్ మరింత దారుణంగా పడిపోయాయి. కేవలం రూ.7.50 కోట్లతో షాకిచ్చింది. రెండ్రోజుల వరకు థగ్‌లైఫ్ ఇండియా వైడ్ రూ.18 కోట్ల నెట్, రూ.22.63 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టానికి ఓవర్సీస్ మార్కెట్ సాయం చేసింది. కమల్ మార్కెట్ దృష్ట్యా ఓవర్సీస్‌లో రూ.22 కోట్ల కలెక్షన్స్ సాధించిన థగ్‌లైఫ్.. ప్రపంచవ్యాప్తంగా రెండ్రోజుల్లో రూ.40 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.210 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం థగ్ లైఫ్‌కు వస్తున్న ఆదరణను చస్తే ఇది కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇండియన్ 2 నుంచి తప్పుకున్న దుల్కర్
ఇండియన్ 2తో భారీ నష్టాలను మిగిల్చిన కమల్ హాసన్.. థగ్‌లైఫ్‌తో మరోసారి నిర్మాతలకు షాకిచ్చేలా కనిపిస్తోంది. లాంగ్ రన్‌లో ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడిలో ఎంత తిరిగి వస్తుందో చూడాలి. అయితే ఇండియన్ 2, థగ్‌లైఫ్‌లలో నటించాల్సిన ఓ యంగ్ హీరో చివరి నిమిషంలో తప్పుకోవడంతో బతికిపోయారు. ఆయన ఎవరో కాదు దుల్కర్ సల్మాన్. తమిళ దర్శక దిగ్గజం శంకర్- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2లో తొలుత సిద్ధార్ధ్ పాత్రకు దుల్కర్‌ను ఎంపిక చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి దుల్కర్ తప్పుకోవడంతో సిద్ధార్ధ్‌కు అవకాశం దక్కింది. తీరా రిలీజయ్యాక ఇండియన్ 2 ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే.
థగ్‌లైఫ్ విషయంలోనూ దుల్కర్ లక్కీయే
ఈ వెంటనే కమల్ హాసన్ సినిమా నుంచి మరోసారి దుల్కర్‌కు అవకాశం దక్కింది. అదే థగ్‌లైఫ్.. ఇందులో శింబు చేసిన పాత్ర చేయడానికి దుల్కర్ అంగీకరించాడు. అయితే అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా దుల్కర్ తప్పుకున్నారు. దాంతో శింబుకి ఈ రోల్ దక్కింది. థగ్‌లైఫ్ రిలీజయ్యాక దాని రిజల్ట్ చూసిన దుల్కర్ మరోసారి బతికిపోయినందుకు ఊపిరి పీల్చుకున్నాడంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు కనుక దుల్కర్ సల్మాన్ చేసుంటే ఆయన కెరీర్‌పై గట్టి ప్రభావం పడేదని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











