Sita Ramam Trailer: స్వచ్ఛమైన ప్రేమ కథలో ఊహించని సస్పెన్స్.. మరో లవ్ మ్యాజిక్!
నేను నా రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి నెక్స్ట్ సీతారామం అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు అతను డైరెక్ట్ చేసిన లై సినిమాతో పాటు పడి పడి లేచే మనసు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి.
ఇక ఇప్పుడు అందరి ఫోకస్ కూడా సీతా రామం అనే సినిమా పైనే ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా అది ఒక్కసారిగా అంచనాల స్థాయిని పెంచేసింది. ఒక ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సస్పెన్స్ ప్రేమ కథ లో చాలా విభిన్నమైన ఎమోషన్స్ ఉన్నాయి. ఒక ఆర్మీ లెఫ్టినెంట్ ఆఫీసర్ తెలియని అమ్మాయికి రాసిన ప్రేమలేఖ చాలా కాలం తర్వాత ఆమెకు చేరవేయాలి అని ఒక వ్యక్తి చెప్పడం ఆ తర్వాత రష్మికమందన ఆ లెటర్ ని సీతామహాలక్ష్మి అనే అమ్మాయికి ఇవ్వాలి అని ఒక టార్గెట్ తో చూడాలని నిర్వహిస్తూ ఉంటుంది.

అయితే ఎంత వెతికినా కూడా సీతామాహాలక్ష్మి అనే అమ్మాయి పేరు దొరక్కపోవడం ఆ తర్వాత సీతామాహాలక్ష్మి దుల్కర్ ప్రేమను ఎంతో అన్యోన్యంగా ప్రజెంట్ చేయడం ట్రైలర్ లో హైలెట్గా నిలిచింది. పిరియాడిక్ బ్యాగ్రౌండ్ లో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్ అయితే త్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలాగే క్యూట్ లవ్ సీన్స్ తో చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు దర్శకుడు అనురాగపూడి సినిమాలకు వర్గం ప్రేక్షకుల. తప్పకుండా సినిమాకు మంచి ఆదరణ దక్కుతూ ఉంటుంది అని దుల్కర్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక హను రాఘవపూడి ప్లాప్ సినిమాలు కూడా అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు సీతారామం సినిమా తప్పకుండా సరికొత్త గా ఉంటుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఆగస్టు 5వ తేదీన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











