NBK107: బాలయ్య మూవీలో ప్రతాప రెడ్డిగా స్టార్ హీరో.. ఫస్ట్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేసేశారుగా!

చాలా కాలం పాటు వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు ఎదురు కావడంతో తెగ ఇబ్బందులు పడ్డారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో ఆయన 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం అదిరిపోయే స్పందనను అందుకుంది. ఫలితంగా కలెక్షన్లను భారీ స్థాయిలో రాబట్టింది. దీంతో బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రావడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. చాలా రోజుల తర్వాత హిట్ ట్రాక్ ఎక్కిన ఈ సీనియర్ హీరో.. రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను చేస్తూ వెళ్లాలని డిసైడ్ అయిపోయారు.

'అఖండ' మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే నందమూరి బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను ప్రకటించాడు. గత ఏడాది ఆరంభంలోనే 'క్రాక్'తో భారీ సక్సెస్‌ను అందుకున్న ఈ దర్శకుడు.. ఆ వెంటనే బాలయ్య కోసం మరో పవర్‌ఫుల్ అండ్ రియలిస్టిక్ స్టోరీని సిద్ధం చేసేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఇటీవలే బాలయ్య గెటప్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Duniya Vijay First Look Release From NBK107

అదిరిపోయే కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణతో పోరాటం చేయబోయే విలన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది నటుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ పాత్ర కోసం కన్నడ సీనియర్ అండ్ స్టార్ హీరో దునియా విజయ్‌ను తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అతడికి స్వాగతం పలుకుతూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ఈ సినిమా రేంజ్ మరింతగా పెరిగిపోయిందనే టాక్ వినిపించింది.

కొద్ది రోజుల క్రితమే సిరిసిల్ల పట్టణంలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో షెడ్యూల్‌ను కూడా ప్రారంభించి శరవేగంగా షూట్‌ను జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి దునియా విజయ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాదు, ఇందులో ఆయన ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అనే పాత్రను చేస్తున్నట్లు రివీల్ చేశారు. ఇక, తాజాగా విడుదలైన పోస్టర్‌లో దునియా విజయ్ స్మోకింగ్ చేస్తూ ఎంతో స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ గెటప్‌తో కనిపించాడు. దీంతో ఈ పిక్ తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.

Duniya Vijay First Look Release From NBK107

నటసింహా బాలయ్య కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రను చేస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X