NBK107: బాలయ్య సినిమాలో కన్నడ స్టార్ హీరో.. ఏ పాత్రను చేస్తున్నాడంటే?
తెలుగు సినీ ఇండస్ట్రీలో జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకునే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఇదే పంథాను ఫాలో అవుతూ వచ్చిన ఆయన.. ఎన్నో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇక, ఇటీవలే 'అఖండ'తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నారాయన. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే ఈ నందమూరి హీరో ఎంతో మంది దర్శకులను లైన్‌లో కూడా పెట్టుకున్న విషయం తెలిసిందే.
'అఖండ' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను ప్రకటించాడు. గత ఏడాది ఆరంభంలోనే 'క్రాక్'తో భారీ సక్సెస్‌ను అందుకున్న ఈ దర్శకుడు.. ఆ వెంటనే బాలయ్య కోసం మరో పవర్‌ఫుల్ అండ్ రియలిస్టిక్ స్టోరీని రెడీ చేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కనుందనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తైపోయాయి.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను ఢీ కొట్టబోయే విలన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది నటుల పేర్లు కూడా వెలుుగలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా దీనిపై అప్‌డేట్ ఇచ్చేసింది. ఈ మూవీలో కన్నడ సీనియర్ అండ్ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అతడికి స్వాగతం పలుకుతూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఇందులో అతడు ఓ పవర్‌ఫుల్ రోల్‌ను చేస్తున్నట్లు మాత్రమే చెప్పారు. దీంతో ఇదే విలన్ రోల్ అని అంతా అనుకుంటున్నారు.
బాలయ్య కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రను చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా జనవరి మూడో వారం నుంచి పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న నందమూరి బాలకృష్ణ తాజాగా 'అఖండ'తో భారీ విజయాన్ని అందుకున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమాకు ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో పోటెత్తాయి. ఇలా ఈ సినిమా నాలుగు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో కలిపి రూ. 70 కోట్లకు పైగా షేర్‌ను, రూ. 120 కోట్లకు పైగా గ్రాస్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదైంది. ఈ ఉత్సాహంతోనే ఆయన త్వరలోనే తన 107వ సినిమాను మొదలు పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











