Prabhas Vs Shah Rukh Dunki రిలీజ్ వాయిదాపై క్లారిటీ ఇచ్చిన యూనిట్

Dunki Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఈసారి కచ్చితంగా చెప్పిన తేదీనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది మూవీ టీం. మరోవైపు అదే రోజు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ డంకీ సినిమా కూడా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈక్రమంలోనే అటు ప్రభాస్, ఇటు షారుఖ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఈక్రమంలోనే ప్రభాస్ సినిమాకు సైడ్ ఇస్తూ... షారుఖ్ ఖాన్ తన సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడం వల్లే సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నారని చర్చ సాగింది. కానీ అవన్నీ తప్పుడు వార్తలే అని డంకీ చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా డంకీ సినిమా రిలీజ్ తేదీ వాయిదా పడినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ముందుగా అనుకున్నట్లే డిసెంబర్ 22వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

Dunki Movie Teasm Confirms No Change in Release Date

ఈ విషయం తెలియడంతో మళ్లీ ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కేవలం డార్లింగ్ ఫ్యాన్సే కాకుండా షారుఖ్ ఖాన్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు సినిమాలూ ఒకే రోజు విడుదల అయితే బాక్సాఫీసు కలెక్షన్లలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఏం జరిగినా సరే అదే రోజు సినిమాలను విడుదల చేస్తామని అటు సలార్, ఇటు డంకీ చిత్రబృందాలు చెబుతున్నాయి. మరి ఏం జరగబోతుందో చూడాలంటే ఈంకా కొంత కాలం ఆగాల్సిందే.

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత గ్రేట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను రెండు భాగాల్లో విడుదల చేయనున్నారు. విజయ్ కిరగందూర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించబోతుంది. అలాగే ఈశ్వరీరావు ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా కనిపించబోతుంది. అలాగే జగపతి బాబు, శ్రియారెడ్డి, మధు గురుస్వామి, పృథ్వీరాజ్ సుకుమారన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Dunki Movie Teasm Confirms No Change in Release Date

మరోవైపు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో.. షారుఖ్ ఖాన్ హీరోగా డంకీ సినిమా రాబోతుంది. వరుసగా పఠాన్, జవాన్ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్టు కావడంతో.. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాడు షారుఖ్. కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. చూడాలి మరి ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల అయి... ఏ రేంజ్ లో బాక్సాఫీసును బద్ధలు చేస్తాయో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X