సమంత ప్లేస్ లో డస్కీ బ్యూటీ... శర్వానంద్ కు ఆమే జోడీ
RX100 తరువాత రెండో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు చాలానే టైమ్ తీసుకున్న అజయ్ భూపతి, లాక్ డౌన్ ముగిసేసరికి సిద్ధంగా ఉండాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు. అయితే, మొదట ఈ సినిమాలో లీడ్ క్యాస్ట్ కోసం శర్వానంద్, సమంతను అనుకున్న అజయ్, లాక్ డౌన్ లో మనసుమార్చుకున్న సంగతి తెలిసిందే.
తొలుత జానూ కపుల్ శర్వా, సమంత జోడీతో ఓ మంచి లవ్ స్టోరీ తెరకెక్కించాలని అనుకున్న అజయ్, ఆ సినిమాకు అంత క్రేజ్ ఏర్పడకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు. అయితే, కేవలం హీరోయిన్ విషయంలోనే మనోడు మనసు మార్చుకున్నాడు.అందుకే శర్వానంద్ కోసం మరో బ్యూటీని ఎంపిక చేశాడు.

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న మహా సముద్రంలో శర్వాకు జోడీగా ఐశ్వర్యారాజేశ్ ను ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోందట. సినిమాలో శర్వానంద్ పాత్ర విభిన్నింగా ఉండబోతోందని వినికిడి.


Click it and Unblock the Notifications











