The Call Him OG చిరుత ఆకలితో ఉంది.. OG మాదే.. ఎప్పటికీ మాదే.. డీవీవీ దానయ్య క్లారిటీ!

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత డీవీవీ దానయ్య గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. 1992లో జంబలకిడి పంబ సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఆయన... ఇప్పటికీ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈయన పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధం అయ్యారు. అదే ఓజీ సినిమా. ఈ సినిమా ప్రకటించి చాలా కాలమే అవుతుండగా.. ఇప్పుడు ఈయన షాకింగ్ కామెంట్లు చేశారు. సినిమాపై అప్ డేట్ ఇచ్చారు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న ది కాల్ హిమ్ ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే సాహో ఫేమ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రాబోతున్న ఈ సినిమా డీవీవీ దానయ్య నుంచి వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నేరుగా డీవీవీ దానయ్యనే ఈ చిత్రాన్ని తెలంగాణకు చెందిన మరో బ్యానర్ కు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Recommended Video

OG పై విష ప్రచారం DVV Entertainments వివరణ Why OG Is Trending | Pawan Kalyan | Telugu Filmibeat

DVV Danaiah Clarrity About Pawan Kalyan The Call Him OG Movie Production Banner

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లకు ది కాల్ హిమ్ ఓజీ ప్రాజెక్టును దానయ్యే అప్పగించినట్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వస్తుందంటూ వివరించారు. అయితే తాజాగా దీనిపై డీవీవీ దానయ్య స్పందించారు. తాను ఈ ప్రాజెక్టును మరెవరికీ ఇవ్వలేదని వివరించారు. ఎక్స్ వేధికగా స్పందించిన ఆయన అదిరిపోయే విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఓజీ సినిమా మనది, ఎప్పటికీ మనదే అని రాసుకొచ్చారు.

DVV Danaiah Clarrity About Pawan Kalyan The Call Him OG Movie Production Banner

అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుందో కూడా తమకు పూర్తి క్లారిటీ ఉందని... ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న పవన్ కల్యాణ్ కు ఎప్పటికీ తాను కృతజ్ఞుడినే అంటూ వివరించారు. అలాగే చివర్లో ఆకలి ఎక్కువ కాలమే ఉంటుంది.. కానీ చిరుత మాత్రం వేటను ఎప్పటికీ వదిలిపెట్టదు అంటూ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో స్పష్టం చేశారు.

డీవీవీ దానయ్య చేసిన ఈ ట్వీట్ చూసిన చాలా మంది తెగ ఎగ్జైట్ అవుతున్నారు. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుందంటూ చెప్పుకొస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా... ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, షాన్ కక్కర్, శ్రీయారెడ్డిలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X