రూమర్లకు నిర్మాత దానయ్య చెక్.. వినయ విధేయ రామ గురించి శుభవార్త..
Recommended Video

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతో్న చిత్రం వినయ విధేయ రామ. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. అయితే సంక్రాంతికి రిలీజ్ అవుతుందో లేదో అనే వార్తలు మీడియాలో వెలుగు చూసిన సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్య క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

సంక్రాంతికి రిలీజ్
రాంచరణ్ కెరీర్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. వినయ విధేయ రామ టాకీ పార్ట్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. డిసెంబర్ 10 నుంచి హైదరాబాద్‌లో రూపొందించిన భారీ సెట్‌లో ఓ పాటను చిత్రీకరించబోతున్నారు.

వినయ విధేయ రామ గురించి
వినయ విధేయ రామ చిత్రానికి సంబంధించిన విషయాలను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య మీడియాకు వెల్లడించారు. క్రేజీ కాంబినేషన్ మెగా పవర్‌స్టార్ రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో టైటిల్‌ను `వినయ విధేయ రామ` అని అనౌన్స్ చేయగానే చాలా మంచి స్పందన వచ్చింది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ను ట్రెమెండస్ రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

డిసెంబర్ 10 నుంచి రాంచరణ్‌పై
వినయ విధేయ రామ సినిమా విషయానికి వస్తే.. టాకీ పార్ట్ పూర్తయ్యింది. హైదరాబాద్‌లో భారీ సెట్‌ను వేసి అందులో డిసెంబర్ 10 నుంచి ఓ సాంగ్‌ను పిక్చరైజ్ చేయబోతున్నాం. ఆల్ రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నాం అని అన్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు: రాంచరణ్, కైరా అద్వానీ, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్, మహేష్ మంజ్రేకర్, మధునందన్ తదితరులు
దర్శకుడు: బోయపాటి శ్రీను
నిర్మాత: డీవీవీ దానయ్య
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: రిషి పంజాబి, ఆర్థర్ ఏ విల్సన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్


Click it and Unblock the Notifications











