పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇప్పట్లో ఆ సినిమా ఉండదట.. ఎదురు చూడొద్దంటూ ట్వీట్!
పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ముఖ్యంగా మా అన్నయ్య, మా అన్నయ్య అంటూ నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. ఆయనను చూసేందుకు తెగ ఆతృత కనబరుస్తుంటారు. ముఖ్యంగా ఆయన సినిమాలు వస్తున్నాయంటే మరింత ఖుషీ అయిపోతూ రచ్చ రచ్చ చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూనే.. మరోవైపు సినిమాలు చేస్తున్నారు.
అయితే మొన్నటి వరకూ వరుసగా చిత్రాలకు సైన్ చేసి.. ఓ ఐదారు సినిమాలను లైన్ లో పెట్టుకున్నారు పవన్ కల్యాణ్. వీలైనంత త్వరగా ఆ సినిమాలు పూర్తి చేసుకుని పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకున్నారు. కానీ రాజకీయాల్లో ఎక్కువగా తిరగాల్సి రావడంతో... సినిమాలకు చాలా బ్రేక్ వస్తోంది. ఏడాది క్రితం ప్రారంభించిన సినిమాలను కూడా అలాగే ఆపాల్సి వస్తోంది. అయితే ముఖ్యంగా సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) చిత్రం షూటింగ్ ఇప్పటికే కాస్త జరిగింది. గతంలో హరిహర వీరమల్లు కంటే ముందుగా వస్తుందని అంతా అనుకోగా... రెండూ అలాగే ఆగిపోయాయి.

సినిమా షూటింగ్ లు ఆగిపోగా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన దేవుడి సినిమాకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ దర్శక, నిర్మాతలను తెగ ఇబ్బంది పెడుతున్నారు. అయితే తాజాగా ఓజీ సినిమాను నిర్మిస్తున్న.. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ తాజాగా స్పందించింది. పుట్టిన రోజు శుభాకాంక్షలతో టైమ్ లైన్ మొత్తం నిండిపోయిందని... సాధారణంగానే ఫ్యాన్స్ అంటే ఆకలిగా ఉంటారని డీవీవీ సినిమాస్ ట్విట్టర్ వేధికగా పోస్ట్ చేసింది.
అలాగే ఇదంతా మీకు తెలియాలనే చెబుతున్నాం... ఇప్పుడు షూటింగ్ జరగట్లేదు.. అందుకే అప్ డేట్లు రావాలంటే ఇకా సమయం పడుతుందని... మీరు ఇక్కడ వేచి చూడకండండటూ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు. అయితే దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఎవరి పుట్టిన రోజు, ఎవరు ట్వీట్లు చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లు చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీలోని ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నారట.

ఇటీవలే తెలంగాణలో ఎనిమిదో చోట్ల పోటీ చేసిన ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. కనీసం ఏపీలో అయనా గెలిచి తమ గుర్తింపును కాపాడుకోవాలని పవన్ కల్యాణ్ చాలా గట్టిగా ట్రై చేస్తున్నారట. అందుకే తాను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ పక్కన పెట్టి మరీ రాజకీయాలు చేయబోతున్నారట. ఏపీలో ఎలక్షన్స్ ముగిశాకే మళ్లీ పవన్ కల్యాణ్ ఈ సినిమాల షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











