ఈగల్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా? మేకర్స్‌కు షాకిస్తున్న విషయం ఇదే!
మాస్ మహారాజా రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ లు హీరోయిన్లుగా రాబోతున్న తాజా చిత్రం ఈగల్" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రాన్ని.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నేరుగా చిత్రబృందమే ప్రకటించింది.
మధుబాల, నవ్ దీప్, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, శివన్నారయణ వంటి వాళ్లు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా విడుదల తేదీపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. చిత్రం బృందానికి తెలిసిన వాళ్లు, చాలా దగ్గరి వాళ్లే మూవీ మేకర్స్ కు గట్టి షాకిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రవితే ఈగల్ సినిమా సంక్రాంతి బరిలోంచి తప్పుకుంటుందా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2024 ఏడాది సంక్రాంతి బరిలో రవితేజ "ఈగల్" సినిమాతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు "గుంటూరు కారం", అలాగే నవమన్మథుడు నాగార్జున "నా సామి రంగా", తేజ సజ్జ "హనుమాన్", విక్టర్ వెంకటేషన్ సైంధవ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అలాగే ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్ చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఇలా మొత్తం సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో భాగంగా 8 చిత్రాలు విడుదల కానున్నాయి.
ఏ ఒక్కరు కూడా తగ్గకుండా పోటీ పడేందుకు తెగ ఆతృత పడుతున్నారు. అయితే ఇప్పటికే టైగర్ నాగేశ్వర రావుతో హిట్టు కొట్టిన ఈయన ఈ చిత్రంపై కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎంత పోటీ ఉన్నా సరే సంక్రాంతికే విడుదల చేస్తామని అంటున్నారు. మరో పదిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తేదీని మార్చుకోవాలని.. ముఖ్యంగా సంక్రాంతి బరి నుంచి తప్పించాలని.. చిత్రబృందానికి దగ్గరి వాళ్లు చెబుతున్నారట. సన్నిహితులు అందరూ సినిమా విడుదలను వాయిదా చేసుకోమని సూచిస్తున్నారట.

ఇప్పటికే తాము తగ్గమని చెప్పినప్పిటికి కూడా.. మేకర్స్ కు దగ్గరి వాళ్లు ఇలా సూచించడం మాత్రం ఆపట్లేదట. మరి దర్శక, నిర్మాతలు కానీ హీరో రవితేజ కానీ ఈ సినిమా విడుదలపై ఏమైనా మనసు మార్చుకుంటారా లేక అన్ని సినిమాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతారా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











