Eagle Twitter Review: మాస్ మహరాజ్ రవితేజ బ్యాక్.. కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ ఎలా ఉందంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా మారి నిర్మించిన చిత్రం ఈగిల్. మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ తదితరులు నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అవుతున్నది.
ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో గురువారం రాత్రి (ఫిబ్రవరి 8వ తేదీ) ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా గురించి నెటిజన్లు వెల్లడించిన సమాచారం వివరాల్లోకి వెళితే..

ఈగిల్ సినిమా చూశాను. ఈ సినిమా గురించి నాకు మిక్స్‌డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అయితే బీజీఎం, సీన్లు, యాక్టర్ల ఎలివేషన్, రవితేజ లుక్ ఇంకా మైండ్‌లో అలా తిరుగుతున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఈగిల్ సినిమా చూసిన తర్వాత నెటిజన్ సంతోషంలో ట్వీట్ చేశాడు. రవన్న ఇరుగదీసి దెబ్బ కొట్టాడు అంటూ ఓ వీడియోను పోస్టు చేశాడు.
ఈగిల్ సినిమా చూసిన తర్వాత రవన్న ఈజ్ బ్యాక్ అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. రవితేజ రాకింగ్, ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ చాలా బాగుంది. డైలాగ్స్ ముఖ్యంగా అదిరిపోయాయి. రవితేజ చెప్పిన డైలాగ్స్ డిక్షన్ మాత్రం సూపర్. ఏం భయపడొద్దు. రవన్న ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశాడు.
ఈగిల్ ఫస్టాఫ్ బాగుంది. థియేటర్‌లో ఇంటర్వెల్ సీన్ బ్లాస్ట్ అయింది. సెకండాఫ్ చాలా బాగుంది. రవితేజ కమ్ బ్యాక్ మూవీ అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నాయి అని ఓ నెటిజన్ అన్నారు.
ఈగిల్ సినిమా మైండ్ బ్లోయింగ్. రవితేజ బీస్ట్‌గా కనిపించారని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మాస్ మహారాజ్ అదరగొట్టాడు. యాక్షన్ సీన్లు, వీఎఫ్ఎక్స్ ఫైర్. క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉంది. అనుపమ పరమేశ్వరన్ సూపర్. కార్తీక్ ఘట్టమనేని గ్రేట్ వర్క్ చేశాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఈగిల్ మూవీ బ్లాక్ బస్టర్. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది. రవితేజ అన్న తన ఫెర్ఫార్మెన్స్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ సూపర్. కథలో పాయింట్ సూపర్ హైలెట్. బీజీఎం బాగుంది. అన్ని విభాగాల పనితీరు బాగుంది. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ సీన్లకు పేపర్లు సరిపోవు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఈగిల్ సినిమా ఫస్టాఫ్ ఓ విధ్వంసం. ఈ సినిమాలో రవన్న విశ్వరూపం చూస్తారు. బీజీఎం బ్యాంగ్, పాటలు ఫైర్. సెకండాఫ్ అంచనాలను మించి ఉంటుందట. రవితేజ టాప్ 5 మూవీస్‌లో ఒకటిగా ఉంటుందని విన్నాను. 150 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అని అభిమాని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











