Amazon Prime Video టాప్ 10లో నిలిచిన ఏకమ్ మూవీ.. బిగ్‌బాస్ శ్వేతావర్మతోపాటు..
ఎస్ఎమ్ఎస్ క్రియేషన్స్ పతాకంపై వరుణ్ వంశీ బీని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఏ కళ్యాణ్ శాస్త్రి, పూజ ఎమ్, శ్రీరామ్ కే సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం ఏకమ్. ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్ ఉప శీర్షిక. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి నటించిన ఈ చిత్రం అక్టోబర్ 29వ తేదీన విడుదలై ప్రేక్షకుల ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నది.
విభిన్నమైన కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏకమ్ చిత్రం పలు రివార్డులతోపాటు అవార్డులు కూడా గెలుచుకుంటున్నది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడిమోలో అసాధారణ స్పందన అందుకొంటున్నది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 503వ చిత్రంగా విడుదలైన "ఏకమ్" కేవలం పది రోజుల్లో టాప్-10లో స్థానం సంపాదించుకొన్నది.

పంచ భూతాల నేపథ్యంలో ఫిలాసఫికల్ డ్రామాగా, తాత్విక చింతనకు ఆధునిక సాంకేతికతను జోడించి తెరకెక్కిన ఏకమ్ చిత్రానికి అమెజాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ... ఏకమ్ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఆదరిస్తుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. మా నిర్మాతల పెట్టుబడిని తిరిగి తెస్తుండటంతోపాటు... దర్శకుడిగా నాకు రెండో సినిమా వచ్చేలా చేసింది. ప్రస్తుతం అమెజాన్ లో టాప్ 10లో చోటుచేసుకొన్న ఏకమ్ అతి త్వరలో మొదటి రెండు మూడు స్థానాల్లో సగర్వంగా నిలుస్తుందనే నమ్మకం మాకుంది అని అన్నారు.
సినిమాటోగ్రఫి: ఇక్బాల్ అజ్మీ
మ్యూజిక్: జొస్ ఫ్రాంక్లిన్
ఎడిటర్: శ్రీనివాస్ తోట
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమ ప్రకాష్
సమర్పణ: బోయపాటి రఘు
నిర్మాతలు: ఎ.కళ్యాణ్ శాస్త్రి, పూజ ఎమ్, శ్రీరామ్.కె.
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వరుణ్ వంశీ.బి


Click it and Unblock the Notifications











