ఎస్పీ.బాలుకు ఎక్మో ట్రీట్మెంట్.. అప్పుడు జయలలితకు కూడా ఇదే చికిత్స.. ఎందుకంటే?

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. ఏ నిమిషానికి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి ఒక్కరు బయబయంగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా వైరస్ ఎంతో మంది కుటుంబాలను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇక ఇప్పుడు బాలు వైరస్ వలన అనారోగ్యానికి గురవ్వడంతో ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. బాలు ఆరోగ్యం నిన్నటి నుంచే క్రిటికల్ గా మారడంతో ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

ఎక్మో ట్రీట్మెంట్ అనగానే..భయంతో..

ఎక్మో ట్రీట్మెంట్ అనగానే..భయంతో..

అసలు ఎక్మో ట్రీట్మెంట్ అంటే ఏమిటి అసలు ఎలాంటి సమయాల్లో అలాంటి చికిత్స అందిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఎక్మో ట్రీట్మెంట్ అనగానే సెలబ్రెటీలు సైతం భయానికి గురవుతున్నారు. బాలుగారు వీలైనంత త్వరగా కొలుకోవలాని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు.

 ఎక్మో ట్రీట్మెంట్ అంటే ఏంటి?

ఎక్మో ట్రీట్మెంట్ అంటే ఏంటి?

ఇక ఎక్మో ట్రీట్మెంట్ విషయానికి వస్తే.. గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఇదే తరహాలో చికిత్స అందించారు. శరీరంలోని ప్రధానమైన గుండె, ఊపిరితిత్తులు ఇతర అవయవాలు పని చేయకపోతే ఎక్మో లైఫ్ సపోర్ట్ అందిస్తారు. ఎక్మో పరికరం గుండె, ఊపిరితిత్తులు చేసే పనులను ఏ మాత్రం తేడా లేకుండా ఈ పరికరం చేస్తుంది. ఆ అవయవాలు మళ్ళీ యధావిధిగా పని చేసే వరకు ఎక్మో పరికరం మనిషి ప్రాణాలను కాపాడడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యం చాలా క్షీణించిన దశలోనే..

ఆరోగ్యం చాలా క్షీణించిన దశలోనే..

మనిషి ఆరోగ్యం చాలా క్షీణించిన దశలోనే ఎక్మో పరికరంను వినియోగిస్తారు. ఈ విషయంలో వైద్యులు రెస్ట్ తీసుకోకుండా కూడా పేషంట్ ని నిత్యం గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కోసం 10 మంది ఎంజిఎమ్ వైద్యులు రాత్రి నుంచి తీరిక లేకుండా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు లేకున్నప్పటికి ఒక్కసారిగా జ్వరం రావడంతో అవయవాలపై ఎఫెక్ట్ చూపించింది.

మరో అప్డేట్ కోసం ఎదురుచూపులు

మరో అప్డేట్ కోసం ఎదురుచూపులు

గుండె.. ఊపిరితిత్తులు పని చేసే వరకు ఎక్మో ట్రీట్మెంట్ ఆపలేరు.. ఈపాటికే వైద్యుల నుంచి అప్డేట్ రావాల్సింది. కానీ వారు బాలు ఆరోగ్యాన్ని ఎలాగైనా మెరుగు పరచాలని బిజీగా ఉండడం వలన బయటకు రాలేకపోతున్నారు. ఈ రోజు సాయంత్రం మళ్ళీ మరో అప్డేట్ ఇస్తారని తెలుస్తోంది. ఇక ఆయన త్వరగా కొలుకోవలని అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేయిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X