రియా చక్రవర్తి సోదరుడికి ఈడీ ఝలక్.. రెండోరోజు కూడా విచారణ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్‌తో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని రెండో రోజు కూడా ఈడీ అధికారులు విచారించారు. ఈడీ అధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం షోవిక్ ముంబైలోని ఈడీ కార్యాలయానికి చేరుకొన్నారు. సుశాంత్ సొమ్మును అక్రమంగా కొన్ని కంపెనీలకు తరలించారనే అంశాలపై షోవిక్‌ను విచారించనున్నారు. ఢిల్లీలో స్థాపించిన ఓ కంపెనీలో షోవిక్, రియాలిద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టిపెట్టింది.

ఇక ఇదే కేసులో రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని కూడా మరోసారి సోమవారం ఈడీ అధికారులు విచారించనున్నారు. అయితే ఎలాంటి సమన్లు జారీ చేయకుండానే షోవిక్‌ను విచారణకు పిలువడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.

 ED questioning Rhea Chakrabortys brother Showik Chakraborty on second day

శుక్రవారం జరిగిన విచారణలో ఐటీ రిటర్న్‌ పత్రాలను అడిగిన సందర్భంలో తాను వాటిని దాఖలు చేయలేదని రియా సమాధానం ఇచ్చినట్టు సమాచారం. తన లీగల్ టీమ్ సహాయంతో వాటిని దాఖలు చేసి ఈడీకి అందజేస్తాను అని రియా చెప్పినట్టు తెలిసింది.

ఇక పాట్నాలో సుశాంత్ సింగ్ తండ్రి తనపై దాఖలు చేసిన కేసును ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేయాలని రియా చక్రవర్తి పెట్టుకొన్న పిటిషన్‌ను ఆగస్టు 11వ తేదీన విచారించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X