Prakash Raj: మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ సమన్లు.. అసలేమైందంటే?
నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈయనకు ఈడీ షాకిచ్చింది. తాజాగా మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ముఖ్యంగా 100 కోట్ల రూపాయల స్కాంకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వచ్చే వారం విచారణకు రావాలని సూచించింది. నవంబర్ 20వ తేదీన తిరుచురాపల్లికి ప్రణవ్ జ్యువెల్లర్స్ కి చెందిన భాగస్వామ్య సంస్థల ఆస్తులపై దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది.
అయితే ఈ జ్యువెల్లరీ సంస్థ కొన్ని ఆభరణాలు, డబ్బులకు సంబంధించిన లెక్కను చూపించలేదట. దీంతో సంస్థ నుంచి 23 లక్షల 70 వేల రూపాయలు, కొన్ని బంగారు ఆభరణాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈక్రమంలోనే తాజాగా ప్రకాశ్ రాజ్ కు నోటీసులు జారీ చేసింది. ప్రణవ్ జ్యూవెల్లర్స్ రూపొందించిన బోగస్ గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ స్కీంపై దర్యాప్తులో భాగంగానే నటుడికి సమన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో అసలు విషయాలు తెలుసుకునేందుకు ఈడీ విచారణ జరుపుతోంది.

ముఖ్యంగా తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగానే ఈ దర్యాప్తు సాగుతోంది. బంగారంపై పెట్టుబడుల పథకం.. పోంజి స్కాం పేరుతో ప్రజల నుంచి ప్రణవ్ జ్యువెల్లర్స్ డబ్బులు సేకరించిందని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్కువ మొత్తం రిటర్న్స్ ఇస్తామని చెప్పి మరీ వంద కోట్ల రూపాయలు సేకరించారని తెలుస్తోంది. అయితే ఈ సంస్థకు ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి ఫీజు తీసుకున్నారట. అయితే ప్రణవ్ జ్యువెల్లర్స్ తో ఈయనకు సంబంధాలు ఉండడంతో ఈడీ నోటీసులు జారీ చేసింది.


Click it and Unblock the Notifications











