twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎదురీత టైటిల్ పవర్ తెలుసా? 1977‌లో ఎన్టీఆర్.. ‘సై’తో రాజమౌళి బ్రేక్ ఇచ్చారు’

    |

    సై', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'బిందాస్', 'మగధీర', 'ఏక్ నిరంజన్' సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించిన శ్రవణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'ఎదురీత'. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. బాలమురుగన్ దర్శకుడు. లియోనా లిషోయ్ కథానాయిక. అరల్ కొరెల్లి సంగీత దర్శకుడు. డా. చల్లా భాగ్యలక్ష్మి, శ్రేష్ఠ, రోల్ రైడా, విశ్వ, స్వామి పాటల రచయితలు. ఈ సినిమా టీజర్‌ను గురువారం (మార్చి 13) ఉదయం నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేశారు. త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా సినిమా ఆడియో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రవణ్ రాఘవేంద్ర మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

     ఎదురీత టైటిల్ గురించి తెలుసా?

    ఎదురీత టైటిల్ గురించి తెలుసా?

    "మేం అడగ్గానే మా టీజర్ విడుదల చేసిన కల్యాణ్ రామ్ గారికి స్పెషల్ థాంక్స్. సినిమా విషయానికి వస్తే... టైటిల్ గురించి మా టీమ్ మధ్య డిస్కషన్స్ జరిగాయి. 'ఎదురీత' కన్ఫర్మ్ చేశాం. ఒకరోజు మా నాన్నగారు సినిమా గురించి అడుగుతూ 'టైటిల్ ఏంటి?' అని అడిగారు. 'ఎదురీత' అని చెప్పాను. అప్పుడు ఆయన 'ఎదురీత' సినిమా గురించి తెలుసా? ఆ టైటిల్ పవర్ తెలుసా? అని ప్రశ్నించారు. నందమూరి తారకరామారావు గారు 1977లో నటించిన 'ఎదురీత' గురించి చెప్పారు అని శ్రవణ్ రాఘవేంద్ర తెలిపారు.

    టైటిల్‌కు కచ్చితంగా న్యాయం చేస్తాం

    టైటిల్‌కు కచ్చితంగా న్యాయం చేస్తాం

    ఇటీవల వస్తున్న చిన్న సినిమాలను మా నాన్నగారు చూస్తున్నారు. వీడు కూడా అలాగే డ్యాన్సులు, ఫైటులు చేస్తాడని అనుకున్నారేమో. అందువల్ల, నేను నాన్నకు కథ, సినిమా గురించి వివరించా. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారికి, ప్రేక్షకులకు చెబుతున్నా... 'ఎదురీత' టైటిల్ కు కచ్చితంగా న్యాయం చేస్తాం. ఓ తండ్రి, కుమారుడు మధ్య కథ సాగుతుంది. ఇదొక ఎమోషనల్ డ్రామా. రియల్ లైఫ్‌లో నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఈ సినిమా కథ వినక ముందు, సినిమా చేయక ముందు... నేను రెస్పాన్సిబుల్ ఫాదర్ అనుకున్నా. కాదని ఈ సినిమా చేస్తున్నప్పుడు తెలిసింది అని శ్రవణ్ పేర్కొన్నారు.

    చాలా ఎమోషనల్‌గా చూపించాం

    చాలా ఎమోషనల్‌గా చూపించాం

    బాధ్యతాయుతమైన తండ్రి అంటే.. ఫీజులు కట్టడం, బట్టలు కొనడం, పిల్లల అవసరాలు చూడటం కాదు. పిల్లలతో మనం టైమ్ స్పెండ్ చేయాలి. ఈ బిజీ లైఫ్‌లో రోజూ కుదరకపోయినా వీకెండ్ అయినా పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళతో ఆదుకోవాలి. అప్పుడప్పుడూ వంట చేసిపెట్టాలి. పిల్లల పనులు తల్లి మాత్రమే కాదు.. తండ్రి కూడా చేయాలని తెలుసుకున్నా. ఇక, సినిమా కథ విషయానికి వస్తే... ఎంతగానో ప్రేమించే కొడుకును తండ్రి మర్చిపోతాడు. తర్వాత ఏం జరిగిందనేదాన్ని దర్శకుడు చాలా ఎమోషనల్ గా చూపించారు అని శ్రవణ్ వెల్లడించారు.

    రాజమౌళి నాకు బ్రేక్ ఇచ్చారు

    నన్ను సినిమా ఇండస్ట్రీకి కోడి రామకృష్ణగారు పరిచయం చేస్తే.. రాజమౌళిగారు 'సై' సినిమాతో బ్రేక్ ఇచ్చారు. రాజమౌళి గురించి మనకు తెలుసు... ప్రతి నిమిషం సినిమా గురించి ఆలోచిస్తారు. మా దర్శకుడు బాలమురుగన్ కూడా అంతే. మా నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ గారి గురించి ఒక్కటే చెబుతా... నాకు ఫాదర్ తర్వాత ఫాదర్ అంతటి వ్యక్తి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమా నిర్మించారు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ.. ఇంటికి వెళ్లి పిల్లలను గట్టిగా హత్తుకుంటారు. అంత బావుంది అని శ్రవణ్ ఉద్వేగానికి లోనయ్యారు.

    నా జీవితం అంతా ఎదురీతే

    నా జీవితం అంతా ఎదురీతే

    సినిమా నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ "ఈ సినిమాకు 'ఎదురీత' టైటిల్ నా గురించే పెట్టారేమో అని ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే... నా జీవితమంతా ఎదురీతే. నేను నిర్మాత కాకముందు, సినిమా అంటే 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని చూడటమే అనుకునేవాణ్ణి. నిర్మాత అయ్యాక... టికెట్ రేటు 2000 రూపాయలు పెట్టినా తక్కువే అనిపిస్తోంది. సినిమా తీయడంలో ఉన్న కష్టం అర్థమైంది. ఈ సినిమా నిర్మించడానికి ముఖ్య కారణం శ్రవణ్. ఆయనది కూడా మా సిద్ధిపేట్. శ్రవణ్ ఫాదర్ మా ప్రొఫెసర్. మా హీరో ఎంతో సహకారం అందించడంతో సినిమాను ముందుకు తీసుకు వెళ్తున్నా. ఆయనకు రుణపడి ఉంటాను" అన్నారు.

    English summary
    Edhureetha' is a thorough entertainer directed by Balamurugan. Starring Shravan Raghavendra and Malayalam actress Leona Lishoy as the lead pair, the film's Teaser was on Thursday unveiled by Nandamuri Kalyan Ram. Speaking on the occasion, the film's cast and crew members thanked the '118' hero for launching the teaser.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X