Pushpa 2: పుష్ప టీమ్‌కు బిగ్ షాక్.. సరైన టైంలో దెబ్బ కొట్టిన రూబెన్
తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్‌లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి కలయికల్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జోడీ ఒకటి. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు కొన్నేళ్ల క్రితం చేసిన 'పుష్ప ది రైజ్' చిత్రం సంచలనం సృష్టించే విధంగా సక్సెస్ సాధించింది.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పుష్ప ది రైజ్' పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు 'పుష్ప ది రూల్' మూవీని రూపొందిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసేశారు.
''పుష్ప ది రూల్' మూవీపై హైప్ అంతకంతకూ పెరుగుతోన్న నేపథ్యంలో దీని మరింత జాగ్రత్తగా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ చూస్తోంది. ఇందులో భాగంగానే అదిరిపోయే ఔట్‌పుట్ కోసం హై రేంజ్ టెక్నీషియన్లతో పని చేయిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా ఎడిటర్ ఆంటోనీ రూబెన్ తప్పుకున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీ నుంచి ఎడిటర్ ఆంటోనీ రూబెన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడట. ప్రస్తుతం అతడు ఈ మూవీకి వర్క్ చేయడం లేదని తెలిసింది. దీంతో మరో ఎడిటర్‌ను వెతికే పనిలో దర్శకుడు సుకుమార్ ఉన్నాడని అంటున్నారు. ఇది పుష్ప టీమ్‌కు పెద్ద షాక్ అని చెప్పుకోవాలి.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కలిసి చేస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











