twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ లో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత

    |

    తెలుగు సినీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా బారిన పడి తెలుగు సినీ పరిశ్రమ కొంతమంది యువ దర్శకులను ఇతర టెక్నీషియన్స్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక సీనియర్ టెక్నీషియన్ అలాగే సీనియర్ నటి ప్రభ సోదరుడు అయిన ఎన్జీవీ ప్రసాద్ అనే ఎడిటర్ కరోనా కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు. ఆయన కొద్ది రోజుల క్రితం వరకు ఆరోగ్యంగా ఉన్నారని అంటున్నారు.

    చాన్నాళ్ళ నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడినట్లు సమాచారం. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు మే 3వ తేదీన చెన్నైలో వెంకటేశ్వర ఆసుపత్రిలో చేర్పించారు. గత కొద్ది రోజులుగా కరోనాకి చికిత్స పొందుతున్న ప్రసాద్ పరిస్థితి విషమించడంతో ఈ రోజు మరణించారని తెలుస్తోంది. ఆయన నటి ప్రభకి అన్నయ్య అవుతారు. నటి ప్రభకి ఇద్దరు సోదరులు ఉండగా ప్రసాద్ చిన్న సోదరుడు. ఇక ప్రసాద్ పలు తెలుగు తమిళ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు.

    Editor NGV Prasad passed Away due to corona virus

    దర్శకుడు కోదండ రామిరెడ్డితో సహా చాలా మంది దర్శకులకు సినిమాలు కూడా ఎడిటర్ గా పనిచేశారు.. ఎడిటర్ కందస్వామి దగ్గర అసిస్టెంట్ గా సినీ లైఫ్ ప్రారంభించిన ప్రసాద్ సాంగ్స్ ఎడిట్ చేయడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. తన సోదరుడి ఆకస్మిక మరణం తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్న సోదరి ప్ర ఆయన మరణవార్త జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది అని పేర్కొన్నారు ఆమె. ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న‌కు ముగ్గురు ఆడ‌పిల్ల‌లు ఇద్ద‌రు కొడుకులు ఉన్నారని తెలుస్తోంది.

    English summary
    Another famous technician from tollywood passed away due to Corona complications. Editor and NGV Prasad who worked for numerous films has passed away due to Corona complications today at Chennai Sri venkateswara hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X