తెలుగు‌లో లస్ట్ స్టోరీస్.. పెద్దలకు మాత్రమే అంటూ మరింత బోల్డ్‌గా ఇషారెబ్బా

లాక్ డౌన్ దెబ్బకు వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ వచ్చింది. ఓ వైపు సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడే ఆగిపోగా సినీమా పరిశ్రమకు సంబంధించిన చాలా మంది జీవితాలు ఆర్థికంగా దెబ్బ తిన్నాయి. అయితే ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో భాగం అయినవారికీ మాత్రం మంచి క్రేజ్ దక్కుతోంది. ఇక తెలుగులో రావాల్సిన లస్ట్ స్టోరీస్ కోసం కూడా ఓ వర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 18+ కథలే హైలెట్..

18+ కథలే హైలెట్..

ఈ లాక్ డౌన్ లో నెట్ ఫ్లిక్స్ అంటే ఏంటో తెలియని వారు కూడా ఎకౌంట్ యక్టివేట్ చేసుకొని 18+ కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏ మాత్రం బోల్డ్ కంటెంట్ ఉన్నా కూడా ఆ వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ దక్కుతోంది. ఈ లాక్ డౌన్ లో ఎక్కువమంది అడల్ట్ కంటెంట్ వైపే లుక్కేశారట. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఉన్నవారు భారీగా ఆదాయాలు అందుకున్నారు.

 లస్ట్ స్టోరీస్

లస్ట్ స్టోరీస్

నేటి ఫ్లిక్స్ లో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ లలో లస్ట్ స్టోరీస్ ఒకటి. నాలుగు భాగాలుగా రూపొందించిన ఈ సిరీస్ లలో నాలుగురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ బోల్డ్ పాత్రల్లో నటించగా కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ వంటి వారు సిరీస్ లను డైరెక్ట్ చేశారు. ముఖ్యంగా రాధికా ఆప్టే, కీయరా చేసిన పాత్రలకు మంచి క్రేజ్ దక్కింది.

తెలుగులో ఎప్పుడంటే..

తెలుగులో ఎప్పుడంటే..

ఇక నెక్స్ట్ అదే బోల్డ్ కాన్సెప్ట్ ను తెలుగులో కూడా రానుంది. సంకల్ప్ రెడ్డి, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ వంటి వారు డైరెక్ట్ చేస్తున్న ఆ వెబ్ సిరీస్ లో హిందీ కంటే హై లెవెల్లో బోల్డ్ కంటెంట్ ఉంటుందట. అమ్మాయిలు శృంగారానికి సంబంధించిన విషయాలపై దీర్ఘంగా ఆలోచిస్తూ ఎలాంటి ఫీలింగ్స్ తో ఉంటారనే విషయాలు ఈ కథలో మెయిన్. ఇక లాక్ డౌన్ అనంతరం ఈ సిరీస్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నెట్ ఫ్లిక్స్ లోనే ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.

ఆ తెలుగమ్మాయే..

ఆ తెలుగమ్మాయే..

లస్ట్ స్టోరీస్ లలో ఎవరి పాత్ర ఎలా ఉన్నా కూడా అందరు ఎక్కువగా ఎదురుచూస్తున్నది మాత్రం ఈషా రెబ్బ పాత్ర కోసమే. హిందీలో కీయరా అద్వానీ చేసిన ఒక బోల్డ్ పాత్రను అమ్మడు తెలుగులో చేసింది. బెడ్ సీన్ లో ఎలా నటించి ఉంటుంది అనే ఆలోచన అందరిలో ఆసక్తిని రేపుతోంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసి సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X