twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా సమయంలో ఏక్తాకపూర్ సంచలన నిర్ణయం.. రూ. 2.5 కోట్లతో

    |

    కరోనావైరస్ కారణంగా స్తంభించిన సినీ పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై హిందీ టెలివిజన్ సీరియల్స్‌లో మొఘల్ ఏక్తాకపూర్ స్పందించారు. లాక్‌డౌన్ కారణంగా రోజువారీ వేతన జీవులు కష్టాలను పరిష్కరించడానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

    తన సొంత సినీ, టెలివిజన్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలింస్‌లో పనిచేసే రోజువారీ వేతన కార్మికులను ఆదుకొనేందుకు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఏడాది తన జీతాన్ని తన సంస్థ సిబ్బందికి విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడయా ద్వారా వెల్లడించారు.

     Ekta Kapoor donates 2.5 crores to Balaji Telefilms workers

    కరోనా సంక్షోభ ప్రభావం చాలా పెద్ద ఎత్తులో ఉంది. ఈ కారణంగా సమస్యల్లో కూరుకుపోయిన వారికి ఆర్థికంగా అండగా నిలువాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే బాలాజీ టెలిఫిలింస్‌ కోసం పనిచేసే రోజువారీ వేతన కార్మికులు, ఫ్రీలాన్సర్లను ఆదుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను. షూటింగులు నిలిచిపోవడం వల్ల వారి జీవితం చాలా దుర్బరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవడం నా ముందున్న తక్షణ కర్తవ్యంగా భావించాను.

    నా సిబ్బందిని ఆదుకోవడానికి నా ఏడాది జీతం రూ.2.5 కోట్లు బాలాజీ టెలిఫిలింస్ సిబ్బందికి విరాళంగా అందజేస్తున్నాను. నా సిబ్బందికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకొంటాను. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కలిసి ఐక్యంగా ముందుకెళ్లాలి. ఇంటి పట్టునే ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ఏక్తా కపూర్ ఓ సందేశాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

    English summary
    Bollywood producer Ekta Kapoor donates 2.5 crores to Balaji Telefilms workers. She said, The impact of the CORONA crisis is huge, unprecedented and multi-pronged. I would thus forsake my one year's salary that is 2.5 crores at Balaji Telefilms so that my co-workers don’t have to take a hit during this period of crisis and complete lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X