twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రభావం చూపిన సర్కార్ చిత్రం!

    |

    ఇళయదళపతి విజయ్ తో మురుగదాస్ రూపొందించిన ఈ హ్యాట్రిక్ చిత్రం సర్కార్. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అదే స్థాయిలో వివాదాలని కూడా సృష్టించింది. ఈ చిత్రంలో అధికార అన్నా డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని పెద్ద రచ్చ జరిగింది. ఈ మేరకు దర్శకుడు మురుగదాస్ పై కేసులు కూడా నమోదయ్యాయి.

    సర్కార్ చిత్రం ద్వారా ఓ కీలక అంశాన్ని దర్శకుడు ప్రజలందరికి తెలిసేలా చేశాడు. అదే 49 పి సెక్షన్. ఈ చిత్రంలో విజయ్ ఓటు హక్కు దొంగిలించబడుతుంది. ఈ 49 పి సెక్షన్ తోనే విజయ్ దొంగఓట్లపై పోరాటం చేస్తాడు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లని చైతన్య పరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలని చేపడుతోంది. ఇందులో భాగంగా సెక్షన్ 49పి గురించి కూడా ప్రజల్లో అవగాహన పెరిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

    Election commission is bringing awareness on 49p.. Murugadoss feels happy

    దీనిపై మురుగదాస్ స్పందించాడు. ఎన్నికల సంఘం సెక్షన్ 49పి విషయంలో చేస్తున్న ప్రచారాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పట్ల చాలా సంతోషంగా ఉందని మురుగదాస్ తెలిపాడు. సర్కార్ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి నాయికగా నటించింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

    English summary
    Election commission is bringing awareness on 49p.. Murugadoss feels happy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X