‘టక్ జగదీష్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్: సినిమాలో హైలైట్ అదే.. నాని అలా మరోసారి

నేచురల్ యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు హీరో నాని. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించుకున్నాడు. అదే సమయంలో వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'టక్ జగదీష్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'నిన్ను కోరి' ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని తర్వాత శివ నిర్వాణ - నాని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'టక్ జగదీష్'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటలు ఎంతగానో ఆకట్టకున్నాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఎమోషనల్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయట. ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో లేని విధంగా ప్రేక్షకులను సీట్లకు కట్టి పడేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ వేరే లెవెల్‌లో ఉంటుందని తెలుస్తోంది.

Emotional Scenea Highlight in Nanis Tuck Jagadish

ఎమోషనల్ సీన్స్ అంటే జీవించే నాని.. 'టక్ జగదీష్' సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడని అంటున్నారు. కొన్ని సన్నివేశాల్లో హావభావాలతోనే ప్రేక్షకులను ఏడిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక, ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X