OG సెట్‌లో ఇమ్రాన్ హష్మీ డిఫరెంట్ లుక్.. అతని రెమ్యునరేషన్ ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా దీనిని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉన్న కూడా సుజిత్ గ్యాప్ తీసుకోకుండా మిగిలిన కాంబినేషన్స్ కి సంబందించిన సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అతనికి సంబంధించిన ఒక లోకేషన్ స్టిల్ రిలీజ్ చేయగా అది వైరల్ అయ్యింది. ఇక అతనికి ఈ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే..

 Emraan Hashmi powerful role in pawan kalyan OG and his remuneration details

పవర్ఫుల్ పాత్ర కోసం: ఈ చిత్రంలో ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో మూవీలో ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హస్మీని రంగంలోకి దించారు. కిస్సింగ్ స్టార్ గా బాలీవుడ్ లో ఇమ్రాన్ హస్మీ పాపులర్ అయ్యారు. ఈ మధ్య మంచి కంటెంట్ బేస్డ్ కథలు చేస్తున్నారు. ఇప్పుడు ఓజీ సినిమాతో సౌత్ లోకి అడుగుపెడుతున్నారు.

 Emraan Hashmi powerful role in pawan kalyan OG and his remuneration details

షూటింగ్ లో ఇమ్రాన్ హష్మీ: తాజాగా ఈ మూవీ షూటింగ్ లో ఇమ్రాన్ హస్మీ జాయిన్ అయ్యారు. దానికి సంబందించిన పిక్స్ కి డివివి ఎంటర్టైన్మెంట్ ప్రొఫైల్ నుంచి ట్విట్టర్ లో అప్డేట్ చేశారు. ఇమ్రాన్ హస్మీ మీద కీలక సన్నివేశాలు హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారంట. వచ్చే నెలలో వారాహి యాత్ర ముగించుకొని పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

అతని రెమ్యునరేషన్ ఎంతంటే: ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఇమ్రాన్ హస్మీ ఏకంగా 70 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారంట. మాఫియా నేపథ్యంలో కాబట్టి కచ్చితంగా అతని విలనిజం చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని బీట్ చేయాలంటే ఆ స్థాయిలోనే పవర్ ఫుల్ గా విలనీ క్యారెక్టర్ ఉండాలని భావించి సుజిత్ ఇమ్రాన్ హస్మీని దించారంట.

 Emraan Hashmi powerful role in pawan kalyan OG and his remuneration details

అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో: మార్కెట్ పరంగా కూడా హిందీలో ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ని ఓజీలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర కోసం ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది వాస్తవం అయితే సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సగానికి పైగా షూట్ ఫినిష్ అయ్యింది. ఇక రెండు నెలల్లో మరో మూడు షెడ్యూల్స్ లో మిగిలిన షూట్ ఫినిష్ చేయనున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X