OG: పవన్ కల్యాణ్‌తో మెంటల్ మాస్ ఎపిసోడ్.. సుజిత్ మైండ్ బ్లోయింగ్ టేకింగ్.. బాలీవుడ్ హీరో ఓ రేంజ్‌లో ఎలివేషన్!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్రేజ్ అండ్ ఫాలోయింగ్ అనే పదానికి మరోపేరు ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి మొన్న భారతీయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా తన పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియా అయినా కూడా మారు మోగాల్సిందే. మరి అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటుగా రాజకీయాల్లో సక్సెస్ అయ్యి తన నుంచి సినిమాలు వస్తే ఆ సినిమా హైప్ ఎలా ఉంటుంది?
ఇప్పుడు అదే హైప్ లో తన తదుపరి అవైటెడ్ సినిమాలు రాబోతున్నాయి. కాగా ఆ చిత్రాలే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు అలాగే ఓజి లు. మరి వీటిలో అయితే రెండు సినిమాలు వీరమల్లు, ఓజి లు పాన్ ఇండియా సినిమాలు కాగా వీటిలో ఓజి పై అయితే ఎనలేని అంచనాలు అభిమానులు పెట్టుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ పవన్ సరసన నటిస్తుంది.

అయితే ఈ సినిమా ఫుల్ ఆన్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని ఇది వరకే వచ్చిన గ్లింప్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే తనపై వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసాక పవన్ కి సరిపడా విలన్ దొరికాడు అని కూడా టాక్ వచ్చింది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాతో ఇమ్రాన్ ముచ్చటించిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాను ఈ సినిమాలో పలు సీన్స్ నటించాను అని కానీ పవన్ తో కంబైన్డ్ గా సీన్స్ ఇంకా తాము చేయలేదు అని అవి ఇంకా చేయాల్సి ఉందని తెలిపాడు. అలాగే ఈ చేసే సీన్స్ లో పవన్ కి నాకు ఒక టక్కర్ సీన్ ఉంది అంటూ ఎగ్జైట్ అయ్యాడు. దీనితో వీరిద్దరి నడుమ సుజీత్ ఒక మెంటల్ మాస్ సీన్ ని డిజైన్ చేసాడని చెప్పొచ్చు. ఇక దీనితో పాటుగా సినిమా రిలీజ్ కోసం కూడా తాను మాట్లాడాడు.

ముందు ప్రొడ్యూసర్స్ సినిమాని సెప్టెంబర్ 27కి ఫిక్స్ చేసారు కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ బిజీగా ఉన్నారు సో అందుకే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఒక కొత్త డేట్ ని చూస్తున్నారు అని తెలిపాడు. ఇలా బాలీవుడ్ మీడియా దగ్గర ఇమ్రాన్ హష్మీ తమ అవైటెడ్ సినిమా కోసం చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ వారు నిర్మాణం వహిస్తుండగా థమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తన మ్యూజిక్ పై కూడా మంచి హైప్ నెలకొనగా ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్యామ్, సలార్ ఫేమ్ శ్రేయా రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తుండగా ఈ సినిమాని తెలుగు, తమిళ్ హిందీ భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











