సెన్సార్ బోర్డు వద్ద టైటిల్ రచ్చ.. మార్చక తప్పలేదు!

సెన్సార్ బోర్డు సభ్యులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని చిత్రాలు విడుదలయ్యాక వివాదాలుగా మారుతున్నాయి. దీనితో సినిమా సెన్సార్ జరిగే సమయంలోనే అన్ని విషయాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సర్కార్ లాంటి చిత్రాలు విడుదలయ్యాక ఎలాంటి చిత్రాలకు ఎలా అనుమతి ఇస్తారని కొంతమంది సెన్సార్ సభ్యులపైనే విమర్శలు చేశారు. అలాంటి వివాదాలు ఇక రిపీట్ కాకూడదని సెన్సార్ బోర్డు భావిస్తోంది.

ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న 'చీట్ ఇండియా' చిత్రం సెన్సార్ బోర్డు వద్ద రచ్చగా మారింది. ఈ టైటిల్ వివాదభరిత మైనదని.. వెంటనే మార్చండి అని సెన్సార్ సభ్యులు సూచించారు. జనవరి 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కొద్ది రోజుల ముందు టైటిల్ మార్చమంటే ఎలా అని చిత్ర యూనిట్ సెన్సార్ సభ్యులని రిక్వస్ట్ చేసింది. అయినా కూడా సెన్సార్ సభ్యులు ససేమిరా అనడంతో మార్చక తప్పలేదు.

Emraan Hashmi’s Cheat India title changed to Why Cheat India after CBFC objection

ఈ చిత్ర టైటిల్‌ని 'వై చీట్ ఇండియా'గా మార్చారు. దీనితో వివాదం తొలగిపోయింది. సౌమిక్ సేన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీకి జోడిగా శ్రేయ ధన్వంతరి హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ ప్రధానంగా ఈ చిత్రం ఉండబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X