twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Puneeth Rajkumar పేరిటి మొక్క నాటిన హీరో విశాల్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఎనిమి టీమ్ ఎమోషనల్

    |

    పచ్చదనం లక్ష్యంగా ఎంపీ సంతోష్ కుమార్ కొనసాగిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ఎన్నో నెలలుగా కొనసాగుతున్న ఈ ఛాలెంజ్‌లో కోసం ఎనిమీ యూనిట్ పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి "గ్రీన్ ఇండియా చాలెంజ్" లో భాగంగా హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

    అనంతరం విశాల్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రభుత్వ మానసపుత్రిక హరితహారం స్పూర్తితో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో వారు ప్రారంభించిన ఈ "గ్రీన్ ఇండియా చాలెంజ్" గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. అంతేకాదు తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఈరోజు మొక్కని నాటుతున్నానని.. ఈ మొక్క తన స్నేహితునికి గుర్తుగా ఉంటుందని తెలిపారు.

    Enemy Stars Vishal, Arya, Mirnalini Ravi Participated in MP Santhosh Kumars Green India Challenge

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న మరో నటుడు ఆర్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యైన మొక్కలు నాటడం ఆనందంగా ఉంది. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కి ధన్యవాదాలు అని నటుడు ఆర్య అన్నారు.

    Enemy Stars Vishal, Arya, Mirnalini Ravi Participated in MP Santhosh Kumars Green India Challenge

    ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని నటి మిర్నాళి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. అనంతరం "గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని ఎనిమీ చిత్ర బృందానికి అందజేశారు.

    English summary
    Enemy Stars Participated in MP Santhosh Kumar's Green India Challenge. Hero Vishal planted a plant in the name of Puneeth Rajkumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X