ఎనర్జిటిక్ స్టార్ మొదలెట్టేశాడు.. రెడ్‌తో హిట్ కొట్టేందుకు రెడీ

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎందరిలోనో ఎనర్జీని నింపేసింది. దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఫుల్ బూస్ట్‌ను ఇవ్వగా.. ఎనర్జిటిక్ స్టార్‌కు నూతనోత్సాహాన్ని నింపింది. అప్పటి వరకు సరైన హిట్ కోసం ఎదురుచూసిన రామ్‌కు.. అసలు సిసలైన హిట్ వచ్చింది. జగడం తరువాత మళ్లీ అంతటి మాస్ సినిమాను చేయని రామ్.. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ పవరేంటో తెలుసుకున్నాడు. నిధి అగర్వాల్‌కు కూడా మంచి హిట్ దొరకడంతో ఇస్మార్ట్ బ్యూటీగా భారీగానే క్రేజ్ తెచ్చుకుంది.

ఇస్మార్ట్ ఇచ్చిన బూస్టప్‌తో మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్. కొత్తదనాన్ని స్వీకరిస్తూ.. ఓ తమిళ హిట్ మూవీని రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ మూవీ కోసం తన ఇమేజ్‌ను పక్కనబెట్టి కొత్తదనాన్ని ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన రామ్ ఫస్ట్ లుక్‌కు ఎంతటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. రెడ్ అంటూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయింది.

Energetic Star Ram New Movie RED Shooting Started

ఆ మధ్య పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా మొదలుపెట్టిన చిత్రబృందం.. తాజాగా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టింది. ఈ మేరకు ఫస్ట్ సీన్‌కు క్లాస్ కొట్టిన వీడియోను షేర్ చేస్తూ.. షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తుండగా.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X