twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు.. హీరో రామ్ సెన్సేషన్.. ఆనందంతో!

    |

    హీరో రామ్.. కొంత కాలం సరైన హిట్ లేక కాస్త నెమ్మదించిన ఈ ఎనర్జిటిక్ స్టార్ ఇస్మార్ట్ శంకర్ విజయంతో మంచి ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ సినిమాలో రామ్ చూపిన ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్ మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించాయి. దీంతో రామ్ స్టామినా ఏంటో బయటపడింది. ఈ జోష్ ఇలా ఉండగానే రామ్ ఎనర్జీ లెవెల్స్ తెలిపేలా మరో సెన్సేషన్ క్రియేట్ కావడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఏంటా సెన్సేషన్? వివరాల్లోకి పోతే..

    సోషల్ మీడియా హవా.. యూ ట్యూబ్ రికార్డులు

    సోషల్ మీడియా హవా.. యూ ట్యూబ్ రికార్డులు

    రోజు రోజుకూ సోషల్ మీడియా హవా బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు సినిమాలు యూ ట్యూబ్ లో విడుదలై సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల థియేటర్స్ లో చూడలేని వారు ఆన్ లైన్ వేదికగా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో యూ ట్యూబ్ రికార్డులు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

    టాలీవుడ్‌పై బాలీవుడ్ చూపు

    టాలీవుడ్‌పై బాలీవుడ్ చూపు

    టాలీవుడ్‌ ఖ్యాతి రోజు రోజుకు రెట్టింపు కావడం, తెలుగు సినిమాలకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ రావడంతో యూ ట్యూబ్ లో తెలుగు సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీంతో వారి వారి సొంత భాషల్లో చూసే అవకాశం రావడంతో సదరు సినిమాలకు డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌ సినిమాలపై బాలీవుడ్ చూపు పడటం విశేషం.

    హీరో రామ్ సినిమాలు.. రికార్డు స్థాయిలో

    తెలుగు హీరో రామ్ నటించిన ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ', ‘హలో గురు ప్రేమకోసమే' సినిమాలను హిందీలోకి డబ్ చేసి యు‌ట్యూబ్‌లో పెట్టడం జరిగింది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఈ మూడు సినిమాలను అదే పనిగా చూసి మిలియన్స్ కొద్దీ వ్యూస్‌తో తమకు ఆ సినిమాలు ఎంతలా నచ్చాయో చెప్పకనే చెప్పేశారు. ఈ మూడు సినిమాలు కూడా 100 మిలియన్లు దాటేసి రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టాయి.

    ఆనందంతో రామ్ ట్వీట్

    ఆనందంతో రామ్ ట్వీట్

    దీంతో హీరో రామ్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మేరకు బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులందరికీ థాంక్స్ చెబుతూ తాను సాధించిన ఫీట్ తాలూకు పోస్టర్ అభిమానులతో పంచుకున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత మరోసారి ఈ రూపంలో రామ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడని ఆయన అభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు.

    English summary
    Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens hilighted in this movie. Now Ram created a history in you tube.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X