వారసుడు వచ్చేశాడు.. రామ్ చేతిలో పండంటి బిడ్డ!!
టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి.. రామ్‌కు ఇంకా పెళ్లే కాలేదు.. వారసుడెలా వచ్చాడని అనుకుంటున్నారా?. అయితే అసలు విషయం మీకు తెలియాల్సిందే. అల్లుడు వచ్చాడని ఎంతో మురిసిపోతున్న రామ్.. ఆ బిడ్డను చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఫోటోను షేర్ చేస్తూ.. ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు.
అయితే నెటిజన్స్ మాత్రం తెగ కంగారు పడుతున్నారు. రామ్‌కు పెళ్లెప్పుడు అయిందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనుమానం వ్యక్తం చేస్తున్నవారిపై నెటిజన్స్ ఫైర్ అవుతూ.. ట్వీట్ సరిగ్గా చూడండి.. అల్లుడని చెప్పాడుగా అంటూ క్లాస్ పీకుతున్నారు. మొత్తానికి కజిన్‌కు పండంటి బిడ్డ ( సిద్దాంత్ పోతినేని) పుట్టడంతో రామ్ ఇంట్లో సంతోషం వెల్లివెరిస్తోంది.

రామ్ ప్రస్తుతం RED సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఊపుతో ఉన్న రామ్.. REDతోనూ ఓ మ్యాజిక్ క్రియేట్ చేయబోతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ చూస్తుంటే.. ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్ని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











