స్టార్ సింగర్ కచేరిలో దొంగల చేతివాటం.. భారీగా మొబైల్స్ చోరీ.. ఖరీదు ఎన్ని లక్షలంటే?

భారతదేశంలో సినీ తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిని దేవుళ్ల మాదిరిగా గుడికట్టి ఆరాధిస్తారు అభిమానులు. వారిని ఒక్కసారి చూస్తే చాలు జన్మధన్యం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఏదైనా ఏరియాకు సినీ సెలబ్రిటీలు వస్తే ఇసుక వేస్తే రాలనంత మంది జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఇదే సమయంలో కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇక దొంగలు కూడా తమ చేతి వాటం చూపిస్తూ అందినకాడికి దోచుకుంటూ ఉంటారు. తాజాగా ఇదే తరహా ఘటన చోటు చేసుకుని భారీగా చోరీ జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..

పబ్లిక్‌ ప్లేస్‌లో స్టార్స్‌కి టెన్షన్
నటీనటులు పబ్లిక్ ప్లేసుల్లోకి రావాలంటేనే వణికిపోయే పరిస్ధితి చోటు చేసుకుంది. కొందరు ఆకతాయిలు బహిరంగ ప్రదేశాల్లో నటీనటుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. వారిని అభ్యంతరకరంగా టచ్ చేయాలని చూడటంతో పాటు విలువైన వస్తువులను కొట్టేసేందుకు కొందరు కాచుకుని కూర్చొంటారు. ఎంతోమంది స్టార్స్ ఇలాంటి కార్యక్రమాలకు హాజరై చోరీకి గురైన సందర్భాలెన్నో.

Enrique Iglesias Mumbai concert ended in shock after over 80 phones worth Rs 24 lakh were stolen

మంజు వారియర్‌తో అసభ్య ప్రవర్తన
కొద్దిరోజుల క్రితం యంగ్ హీరోయిన్ శ్రీలీలను షూటింగ్ ముగించుకుని వస్తుండగా కొందరు ఆకతాయిలు గుంపులోకి లాక్కెళ్లిపోయారు. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి ఆమెను రక్షించారు. మలయాళ నటి మంజు వారియర్‌ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌ ముగించుకుని తిరిగి వెళ్తుండగా అభిమానులు చుట్టుముట్టారు. ఇంతలో ఓ వ్యక్తి ఆమె నడుమును గిల్లగా , మరికొందరు ఆమె ఛాతి భాగాన్ని టచ్ చేసేందుకు యత్నించారు. దీంతో షాకైన ఆమె వెంటనే కారులో వెళ్లిపోయారు.

ముంబైలో ఎన్రిక్ ఇగ్లియోసిస్ కన్సర్ట్
కాగా.. స్పెయిన్‌‌కు చెందిన ప్రఖ్యాత సింగర్, గ్రామీ అవార్డ్ విజేత ఎన్రికే ఇగ్లియోసిస్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన కన్సర్ట్ పెడితే జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ క్రమంలోనే ముంబైలో తొలిసారిగా అడుగుపెట్టిన ఆయనకు ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బుధవారం సాయంత్రం ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) ఎంఎంఆర్‌డీయే గ్రౌండ్స్‌‌లో జరిగిన ఈవెంట్‌కు సంగీత అభిమానులు తరలివచ్చారు. తన గాత్రం, స్టైల్‌తో ఎన్రిక్ అందరినీ అలరించారు. హీరో, బైలామోస్ వంటి క్లాస్ హిట్స్‌తో వేలాది మంది అభిమానులను నోస్టాల్జియా సముద్రంలోకి తీసుకెళ్లారు. కొందరైతే ఆయనతో గొంతు కలిపి ముంబై గ్రౌండ్స్‌ను హోరెత్తించారు. ఈ కచేరిని వీక్షించాలంటే మినిమమ్ ఎంట్రీ ఫీజు 7000 రూపాయలుగా నిర్ణయించారు.

కన్సర్ట్‌లో దొంగల చేతివాటం
వేలాది మంది హాజరైన ఈ కన్సర్ట్‌లో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. దాదాపు 80కి పైగా కాస్ట్‌లీ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేశారు. వీటి విలువ దాదాపు 24 లక్షల రూపాయల పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఎన్రీక్ కచేరి ముగిసిన తర్వాత బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. బాధితుల్లో మేకప్ ఆర్టిస్ట్, హోటల్ యజమాని, విద్యార్ధులు, జర్నలిస్ట్, వ్యాపారవేత్తలు ఉన్నారు. 50 ఏళ్ల ఎన్రిక్ ముంబైలో దాదాపు 90 నిమిషాల పాటు నిర్వహించిన ఈ కన్సర్ట్‌కు దాదాపు 25000 మందికి పైగా హాజరైనట్లుగా తెలుస్తోంది.

కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో మలైకా అరోరా?
ఇక ఇదే కన్సర్ట్‌కి హాజరైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా హాట్ టాపిక్‌గా మారారు. ఈ ఈవెంట్‌లో ఓ కుర్రాడితో మలైకా క్లోజ్‌గా కనిపించారు. దాంతో అతను ఎవరు? మలైకాతో అంత క్లోజ్‌గా ఎందుకు ఉన్నాడు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 33 ఏళ్ల ఈ కుర్రాడితో మలైకా ప్రేమలో పడిందని.. అతని పేరు హర్ష్ మెహతా అని వార్తలు వస్తున్నాయి. ఇతనికి బెల్జియంలో డైమండ్ కంపెనీ ఉండగా, మరికొన్ని వ్యాపారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: bollywood news mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X