వైరల్ పిక్స్ : వర్మ విసిరిన బాంబ్.. బీచ్‌లో అందాల కనువిందు!

రామ్ గోపాల్ వర్మ గురించి, ఆయన తెరకెక్కించే శైలి గురించి అందరికీ తెలిసిందే. ఓ మూసధోరణిలో వెళ్తోన్న సినిమా గతిని మార్చేశాడు. ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు ఆర్జీవి. అయితే ఈ మధ్య కాలంలో ఆయన తన స్థాయికి తగ్గ సినిమాలను తెరకెక్కించలేకపోతున్నాడు. అయితే వర్మ నుంచి వచ్చే చిత్రాల ప్రకటనల్లో ఎన్ని తెర మీదకు వస్తాయో ఇంకెన్ని మరుగున పడతాయో చెప్పలేం. వర్మ ప్రస్తుతం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్‌తో బిజీగా ఉన్నాడు.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో..

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో..

బ్రూస్లీ నటించిన హాలీవుడ్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో బ్రూస్లీ కొన్ని కోట్ల మందికి దగ్గరయ్యాడు. ఇండియాలోనూ బ్రూస్లీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో వర్మ కూడా ఒకడు.

ఆయనపై ఉన్న అభిమానంతోనే..

ఆయనపై ఉన్న అభిమానంతోనే..

రాంగోపాల్ వర్మకు కూడా బ్రూస్లీ అంటే ఎనలేని అభిమానం. తన సినిమాలలోని ఫైట్స్ ఆయనను స్ఫూర్తిగా చేసుకుని చేసినవే అని వర్మ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అందుకే ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో తన దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు.

పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ చిత్రంగా రికార్డు సృష్టించబోతోంది. ఈ మూవీలో హీరోయిన్‌ పూజా భలేకర్ చేసిన రిస్కీ ఫైట్స్ అత్యంత ఆకర్షణీయంగా, వళ్ళు గగుర్పొడిచేవిధంగా ఉన్నట్లు ఇది వరకు విడుదలైన టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.

Recommended Video

RGV Irritates Pawan Kalyan Fans With His Tweet || Filmibeat Telugu
గ్లామర్ టచ్ కూడా..

గ్లామర్ టచ్ కూడా..

సినిమాలో తనదైన శైలిలో గ్లామర్ ఉండకపోతే అది వర్మ చిత్రమెలా అనిపించుకుంటుంది. అందుకే పూజా అందాలను ఎన్ని రకాలుగా చూపించాలో అన్ని రకాలుగా చూపించేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన కొన్ని పోస్టర్స్ చూస్తే వావ్ అనాల్సిందే. జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X