For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ మాట చెప్పగానే ఎన్టీఆర్ ఫీలింగ్స్.. కళ్యాణ్ రామ్ కామెంట్స్

    |

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా!'. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మేహ్రీన్ కథానాయకగా నటించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌గా సంక్రాంతి పండగ కానుకగా ఈ రోజే (జనవరి 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

    ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో 'ఎంత మంచివాడవురా!' సినిమా గురించిన సంగతులను పంచుకున్నారు కళ్యాణ్ రామ్. ముందుగా ఈ సినిమాకి ఆయన 'ఆల్ ఈజ్ వెల్' అనే టైటిల్ అనుకున్నారని, అయితే ఈ కథకి తెలుగుదనంతో కూడుకున్న టైటిల్ అయితే బాగుంటదని తాను చెప్పడంతో అప్పుడు ఎంత మంచివాడవురా' టైటిల్ ఫిక్స్ చేశారని చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.

     Entha Manchivaadavuraa: N. T. Rama Rao Jr. feelings

    ఈ సినిమాకి సతీశ్ వేగేశ్న అందించిన కథ, మాటలు ప్రధాన బలమని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఈ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు తన తమ్ముడు ఎన్టీఆర్ చాలా సంతోషించాడని, ప్రేక్షకులకి నచ్చి, బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పాడని కళ్యాణ్ రామ్ తెలిపారు.

    మహేష్ బాబు,అల్లు అర్జున్ సినిమాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాలో టి.ఎన్.ఆర్, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, అన్నపూర్ణమ్మ, సుధర్శన్, భద్రం, సుభలేఖ సుధాకర్, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు.

    English summary
    Nandamuri Kalyan Ram's new movie Entha Manchivaadavuraa released today. Hero Nandamuri Kalyan Ram says about Entha Manchivaadavuraa movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X