Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఆ మాట చెప్పగానే ఎన్టీఆర్ ఫీలింగ్స్.. కళ్యాణ్ రామ్ కామెంట్స్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా!'. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మేహ్రీన్ కథానాయకగా నటించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సంక్రాంతి పండగ కానుకగా ఈ రోజే (జనవరి 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో 'ఎంత మంచివాడవురా!' సినిమా గురించిన సంగతులను పంచుకున్నారు కళ్యాణ్ రామ్. ముందుగా ఈ సినిమాకి ఆయన 'ఆల్ ఈజ్ వెల్' అనే టైటిల్ అనుకున్నారని, అయితే ఈ కథకి తెలుగుదనంతో కూడుకున్న టైటిల్ అయితే బాగుంటదని తాను చెప్పడంతో అప్పుడు ఎంత మంచివాడవురా' టైటిల్ ఫిక్స్ చేశారని చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.
ఈ సినిమాకి సతీశ్ వేగేశ్న అందించిన కథ, మాటలు ప్రధాన బలమని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఈ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు తన తమ్ముడు ఎన్టీఆర్ చాలా సంతోషించాడని, ప్రేక్షకులకి నచ్చి, బ్లాక్బస్టర్ అవుతుందని చెప్పాడని కళ్యాణ్ రామ్ తెలిపారు.
మహేష్ బాబు,అల్లు అర్జున్ సినిమాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాలో టి.ఎన్.ఆర్, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, అన్నపూర్ణమ్మ, సుధర్శన్, భద్రం, సుభలేఖ సుధాకర్, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు.