Entha Manchivaadavuraa Event: మా తొలి సినిమా జాతీయ అవార్డు గ్రహీతతో.. ఉమేష్ గుప్తా ఎమోషనల్

ఆదిత్యా మ్యూజిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పించగా ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలుగా సతీష్ వేజేశ్న దర్శకత్వం వహించిన ఎంత మంచివాడవురా చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నది. నందమూరి కల్యాణ్ రామ్, మెహ్రీన్ పిర్జాదా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహించారు. రాజు తోట కెమెరా, తమ్మి రాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ఉమేష్ గుప్తా మాట్లాడుతూ..

ఎన్టీఆర్, బాలకృష్ణ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్. ఎన్నో ఏళ్లుగా మా సంస్థను ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు. మేము నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన వెంటనే జాతీయ అవార్గు సొంతం చేసుకొన్న సతీష్ వెజేశ్నతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా అందర్ని ఆకట్టుకొంటుంది. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరు మనసుపెట్టి పనిచేశారు. ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. జనవరి 15న రిలీజ్ అవుతుంది. థియేటర్లో సినిమాను చూసి ఆదరించండి. మమల్ని ప్రోత్సహిస్తున్న మీడియా, ప్రెస్, సినిమా పరిశ్రమకు రుణపడి ఉంటాం అని ఉమేష్ గుప్తా మాట్లాడారు.

 Entha Manchivaadavuraa Pre Release Event: Producer Umesh Gupta speech

నిర్మాత ఆదిత్య గుప్తా మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా మమల్ని ప్రొత్సహిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సంగీత అభిమానులకు ధన్యవాదాలు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను రూపొందించాం. ఇప్పటి వరకు ఆదరించిన విధంగానే ఈ సినిమాను ఆదరించాలని కోరుకొంటున్నాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X