ఎదురించేవాడు రానంతవరకే.. ఎంత మంచివాడవురా ట్రైలర్
మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా చిత్రాలు చేసే సతీష్ వేగేశ్న కలిసి ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఎంత మంచివాడవురా అంటూ టైటిల్‌తోనే ఓ పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. టీజర్, సాంగ్స్‌తో మంచి అంచనాలను పెంచింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ కార్యక్రమంలో ఈ మూవీ ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు.
ఇప్పటికే టీజర్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. రాముడు మంచి వాడే.. కానీ రావణ సూరుడిని వేసేయలే.. అనే డైలాగ్‌ను బట్టి ఈ సినిమా పాయింట్ ఏంటో చెప్పకనే చెప్పేసింది చిత్రబృందం. ఇక పాటలతోనూ మంచి హైప్ క్రియేట్ చేసిన ఎంత మంచివాడవురా టీమ్.. ట్రైలర్‌తో మరింత క్రేజ్ పెంచుకునేందుకు సిద్దమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను యంగ్ టైగర్ విడుదల చేశాడు.

'అడిగి ఐ లవ్ యూ చెప్పించుకోకూడదు.. దేవుడు అడిగింది ఇస్తాడు. .కాని లేటుగా ఇస్తాడేమో.. ఎదురించేవాడు రానంత వరకేరా.. భయపెట్టేవాడగి వాడి రాజ్యం.. మీరు నా తండ్రి .. మీరు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు... చిన్నపటి నుంచి. నాకో అలవాటుంది.. ఎవరేది ఇచ్చినా.. తిరిగిచ్చేస్తాను.. అది ప్రేమైనా.. భయమైనా..'అనే డైలాగ్‌లు చూస్తుంటూ ఈ చిత్రం ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











