జోరుమీదున్న 'ఎంత మంచివాడవురా!' ట్రైలర్.. నందమూరి హీరో హవా
ఈ సంక్రాంతి రేస్‌లో తానూ ఉన్నానని నిరూపిస్తూ సూపర్ జోష్ చూపిస్తున్నాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా రూపొందిన 'ఎంత మంచివాడవురా!' మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ మేరకు చిత్ర ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసింది చిత్రయూనిట్.
''అడిగి ఐ లవ్ యూ చెప్పించుకోకూడదు.. దేవుడు అడిగింది ఇస్తాడు.. కీనీ లేటుగా ఇస్తాడేమో.. ఎదురించేవాడు రానంత వరకేరా.. భయపెట్టేవాడగి వాడి రాజ్యం.. మీరు నా తండ్రి .. మీరు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు... చిన్నపటి నుంచి నాకో అలవాటుంది.. ఎవరేది ఇచ్చినా తిరిగిచ్చేస్తాను.. అది ప్రేమైనా.. భయమైనా..'' అనే డైలాగ్‌లు ట్రైలర్‌లో బాగా ఆకట్టుకున్నాయి.
దీంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయి రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. అంతేకాదు.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు తాజాగా ఆ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

ఉమేష్ గుప్త సమర్పణలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కింది 'ఎంత మంచివాడవురా!' మూవీ. చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్, ఇతర అప్‌డేట్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











