twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే కాన్సెప్టుతో ‘ఎంతవారలైనా’

    |

    అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, సీతారెడ్డి ముఖ్యపాత్రల్లో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మిస్తున్న థ్రిల్లింగ్‌ హారర్‌ మూవీ 'ఎంతవారలైనా'. ఈ మూవీ టీజర్‌ చిత్ర బృందం హైదరాబాద్‌లో మంగళవారం(మార్చి 5)న విడుదల చేసింది.

    సినిమా గురించి దర్శకుడు వివరిస్తూ... ''ఎంతవారలైనా కాంత దాసులు కావచ్చు, కనకదాసులు కావచ్చు. కానీ, తప్పు చేసినప్పుడు ఎంతవారలైనా కూడా కచ్చితంగా శిక్షార్హులే.. అనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకు మ్యూజిక్‌ సుక్కు అందించారు. మూడు పాటలు చాలా బాగా వచ్చాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌, టెక్నిషన్స్‌ ఎంతో కష్టపడి పనిచేశారు. సినిమా ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది.'' అన్నారు.

    Enthavaralaina Teaser released

    నిర్మాత జి. సీతారెడ్డి మాట్లాడుతూ - ''దర్శకుడు గురు చిందేపల్లి నా క్లాస్‌ మేట్‌, చిరకాల మిత్రుడు. సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో నిర్మాతనయ్యాను. ఈ సృష్టిలో మంచి చెడు రెండు మార్గాలు ఉంటాయి. అయితే చెడు మార్గాన్ని ఎంచుకుంటే ఎలాంటి పరిణామాల్ని అనుభవించాల్సి ఉంటుందో ఈ సినిమా చూపించాం. ఇది న్యూ జనరేషన్‌ హారర్‌ మూవీ. క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాలు సినిమాకే హైలెట్‌. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా హైదరాబాద్‌, మైసూర్‌, బెంగళూరు, చిక్‌మంగళూరులోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. కన్నడ, తెలుగు భాషల్లో విడుదలచేయబోతున్నాం'' అన్నారు.

    అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, సీతారెడ్డి, స్వప్న, అలీషా, అభిలాష్‌, మాస్టర్‌ అయాన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, ఫోటోగ్రఫీ: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఎడిటింగ్‌: వి.నాగిరెడ్డి, ఆర్ట్‌: బాబ్జీ, స్టిల్స్‌: ఈశ్వర్‌, నిర్మాత: జి.సీతారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గురు చిందేపల్లి.

    English summary
    Teaser of New Generation Horror Thriller Enthavaralaina. Produced by G.Seetha Reddy, Directed by Guru Chindepalli. Producer G.Seetha Reddy plays an important role as Superintendent of Police in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X