For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘Enugu సమాజంపై యుముడు డైరెక్టర్ హరి విమర్శనాస్త్రం.. అఖండ రేంజ్ హిట్ ఖాయం‘

  |

  శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, నటీ నటులుగా సింగం సిరీస్ లాంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఏనుగు". ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేయనున్నారు ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ హోటల్ లో" ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ను సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో ప్రముఖులు మాట్లాడిన విషయాల్లోకి వెళితే..

  సమాజంలోని సమస్యలపై

  సమాజంలోని సమస్యలపై

  చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ... ఏనుగు నేను చేస్తున్న 16వ సినిమా. ఇప్పటి వరకు నా సినిమాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు మరియు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు ధన్యవాదాలు. ఈ ఏనుగు సినిమా కమర్షియల్ , ఎమోషనల్ యాక్షన్ సినిమా. అందరూ ఫ్యామిలీ‌తో వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలని ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ లో ఉన్న ప్రతి ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు. కాబట్టి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

  తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి

  తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి


  హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ...నా కెరీర్లో ఏనుగు బిగ్గెస్ట్ సినిమా తెలుగు తమిళ్‌లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. హరి సార్ తో వర్క్ చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను. ఇందులో మంచి ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఇందులో చూయించడం జరిగింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కి కనెక్ట్ అవుతారు. జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. గోపీనాథ్ గారు ఎక్సలెంట్ మేకింగ్ ఇచ్చారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

  ఎమోషనల్ కంటెంట్‌తో

  ఎమోషనల్ కంటెంట్‌తో

  చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులు ఈ ఎమోషన్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందుకే మంచి కంటెంట్ తో ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన "ఏనుగు" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఒక నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్ గా తమిళ "యానై" సినిమాను తెలుగులో "ఏనుగు" పేరుతో విడుదల చేస్తున్నాను. ఏనుగు ఎంత బలమో ఈ సినిమా లో చూస్తారు ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతూ బయటకు వస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను అని అన్నారు

  హరి నుంచి నేర్చుకొన్నా

  హరి నుంచి నేర్చుకొన్నా

  నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. దర్శకుడు హరికి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇద్దరిదీ ఒకటే స్కూల్ అయినా హరి దగ్గర్నుంచి ప్రతి రోజు చాలా విషయాలు నేర్చుకుంటుంటాను. ఏనుగు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా హార్ట్ ఫుల్ గా కనెక్ట్ అవుతారు. మంచి ఎమోషనల్‌తో ఫుల్ ప్యాక్‌తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుతున్నాను. హీరో, హీరోయిన్ చాలా చక్కగా నటించారు. వారితో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. వీరికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అన్నారు.

  హరి దర్శకత్వంలో నటించడం

  హరి దర్శకత్వంలో నటించడం


  నటి ప్రియా మాట్లాడుతూ... తెలుగు తమిళ్ లో ఒకే సారి రిలీజ్ అవుతున్న ఏనుగు సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే హరి గారి దర్శకత్వంలో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాధికా మేడం, సముద్ర సర్, జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇలా సీనియర్స్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

  అఖండ రేంజ్ హిట్

  అఖండ రేంజ్ హిట్


  ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా కమర్శియల్ గా సక్సెస్ కావడానికి కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. ఏనుగు ట్రైలర్ చాలా బాగుంది. ఇందులో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఇలా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఉన్నాయి. మనం ఏది చేసిన విఘ్నేశ్వరుడితో పూజ మొదలుపెడతాం. అలాంటిడి ఏనుగు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దర్శకుడు హరి పాన్ ఇండియా దర్శకుడు ఈ మధ్య వచ్చిన అఖండ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు వస్తున్నా ఏనుగు చిత్రం కూడా అఖండ సినిమా అంత గొప్ప విజయం సాధించాలి అన్నారు.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు


  నటీనటులు: అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, అమ్ము అభిరామి, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, ఆడుకలం జయపాలన్, ఇమ్మాన్ అన్నాచ్చి, రాజేష్, ఐశ్వర్య, బోస్ వెంకట్, సంజీవ్, పుగజ్ తదితరులు
  కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హరి
  ప్రొడక్షన్ హౌస్: విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్
  నిర్మాతలు: సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, వేదికకారన్‌పట్టి ఎస్.శక్తివేల్
  సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
  డీవోపీ: గోపీనాథ్
  ఆర్ట్ డైరెక్టర్: మైఖేల్
  ఎడిటర్: ఆంథోని
  స్టంట్స్: అన్ల్ అరసు
  సహ దర్శకుడు: ఎన్ జాన్ ఆల్బర్ట్
  కొరియోగ్రఫీ: బాబా భాస్కర్, ధీనా
  పీఆర్వో: నాయుడు - ఫణి (బియాండ్ మీడియా)

  English summary
  Vigneswara Entertainments and Drumsticks Production House, and presenter Smt. Jaganmohini, have come together to release 'Enugu', whose release date will be announced soon. The action drama stars Arun Vijay, Priya Bhavani Shankar, Samuthirakani, 'KGF' Ramachandra Raju, Radhika Sarathkumar, Yogi Babu and others. It is directed by action director Hari, who has made back-to-back hits with 'Singham' series'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X