Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యంగ్ హీరోయిన్‌తో కమెడియన్ల ఆటా పాట.. రఘుబాబు, ఫిష్ వెంకట్ జోష్‌తో
శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ఎర్రచీర. సత్య సుమన్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ యాక్షన్ సస్పెన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. సెప్టెంబర్ 20న సినిమా రిలీజ్ కానుంది. మహానటి ఫేం బేబి సాయి తేజస్వి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
సారధి స్టూడియోస్‌లో హీరోయిన్ ప్రియాంక అగస్టిన్ - రఘుబాబు- ఫిష్ వెంకట్ సహా గ్రూప్ పై ఐటెమ్ పాట చిత్రీకరిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు సత్య సుమన్ బాబు మాట్లాడుతూ ఎర్ర చీరలో శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్.. బేబి సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ కామరాజు, అజయ్, శ్రీరాం, అలీ పాత్రలు ఆకట్టుకుంటాయి.
ఛేజింగ్ సీన్స్... హారర్, కామెడీ హైలైట్ గా నిలుస్తాయి. త్వరలో క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేయనున్నాం అని తెలిపారు. షూటింగ్‌తోపాటు నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. సెప్టెంబర్ 20న సినిమాని రిలీజ్ చేస్తాం అని సత్య సుమన్ బాబు అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్ మాట్లాడుతూ.. ఆగస్టు చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 20న రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రంలో శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.అని తెలిపారు. ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో లీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామన్నారు.
ఈ చిత్రానికి మాటలు: గోపీ విమల పుత్ర, కెమెరా: చందు, ఫైట్స్: నందు, కళ: సుభాష్- నాని, కథ-కథనం-దర్శకత్వం: సత్య సుమన్ బాబు.