twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యంగ్ హీరోయిన్‌తో కమెడియన్ల ఆటా పాట.. రఘుబాబు, ఫిష్ వెంకట్ జోష్‌తో

    |

    శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ఎర్రచీర. సత్య సుమన్‌ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. హార‌ర్ యాక్షన్ స‌స్పెన్స్ ప్ర‌ధానంగా రూపొందుతున్న‌ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. సెప్టెంబ‌ర్ 20న సినిమా రిలీజ్ కానుంది. మ‌హాన‌టి ఫేం బేబి సాయి తేజ‌స్వి మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు.

    సార‌ధి స్టూడియోస్‌లో హీరోయిన్ ప్రియాంక‌ అగ‌స్టిన్ - ర‌ఘుబాబు- ఫిష్ వెంకట్ స‌హా గ్రూప్ పై ఐటెమ్ పాట చిత్రీక‌రిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు సత్య సుమన్‌ బాబు మాట్లాడుతూ ఎర్ర చీర‌లో శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్.. బేబి సాయి తేజ‌స్విని, కారుణ్య చౌదరి, ర‌ఘుబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌మల్ కామ‌రాజు, అజ‌య్, శ్రీ‌రాం, అలీ పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి.

    Erra chira update: Raghu Babu, Fish venkat in Item song

    ఛేజింగ్‌ సీన్స్‌... హారర్‌, కామెడీ హైలైట్ గా నిలుస్తాయి. త్వ‌ర‌లో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌నున్నాం అని తెలిపారు. షూటింగ్‌తోపాటు నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌వుతున్నాయి. సెప్టెంబ‌ర్ 20న సినిమాని రిలీజ్ చేస్తాం అని సత్య సుమన్ బాబు అన్నారు.

    Erra chira update: Raghu Babu, Fish venkat in Item song

    ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్‌ మాట్లాడుతూ.. ఆగస్టు చివరి నాటికి అన్ని ప‌నులు పూర్తి చేసి సెప్టెంబ‌ర్ 20న రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రంలో శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.అని తెలిపారు. ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో లీజ్‌ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామన్నారు.

    ఈ చిత్రానికి మాట‌లు: గోపీ విమ‌ల పుత్ర‌, కెమెరా: చ‌ందు, ఫైట్స్: న‌ందు, క‌ళ‌: సుభాష్‌- నాని, క‌థ‌-క‌థ‌నం-ద‌ర్శ‌క‌త్వం: సత్య సుమన్‌ బాబు.

    English summary
    Actor Srikanth doing a crucial role in Latest Erra Chira movie. This movie directed by Satya Sumar Babu. Produced by Thota Satish. Director Satya told that.. Srikanth will be special attraction for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X