పెంగ్విన్‌లో విలన్ ఎవరనేది టాప్ సీక్రెట్.. మాస్క్ వెనుక ఎవరో కనుక్కొంటే.. ఛాలెంజ్ విసిరిన డైరెక్టర్

అందాల నటి కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, సింగిల్స్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ చిత్రంలో గర్బిణిగా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో జోకర్ మాస్క్‌లో ఉండే విలన్ పాత్ర ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నది.

యూనిట్ సభ్యులకు కూడా తెలియదు

యూనిట్ సభ్యులకు కూడా తెలియదు

అయితే పెంగ్విన్ చిత్రంలో విలన్ పాత్రను ఎవరు వేశారో అనే విషయాన్ని దర్శక, నిర్మాతలు సీక్రెట్‌గా పెట్టారు. ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ పాత్రను ఎవరు వేశారో అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతాం అని దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ అన్నారు. ఇప్పటి వరకు విలన్ రోల్ వేసింది ఎవరో సినిమా యూనిట్‌కు తెలియకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం అని తెలిపారు.

మాస్క్ వెనుక ఉన్నది ఎవరనే విషయం

మాస్క్ వెనుక ఉన్నది ఎవరనే విషయం


పెంగ్విన్ సినిమా తొలి షాట్ నుంచి చివరి వరకు ఆద్యంతం మిస్టరీ, థ్రిల్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నాం. మాస్క్ ధరించింది ఎవరనే విషయం యూనిట్ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం. సస్పెన్స్‌ను మెయింటెన్ చేయడానికి తక్కువ మంది యూనిట్‌తో షూటింగ్ చేశాం అని ఈశ్వర్ కార్తీక్ చెప్పారు.

రిలీజ్ తర్వాతే సీక్రెట్ రివీల్

రిలీజ్ తర్వాతే సీక్రెట్ రివీల్

పెంగ్విన్‌లో విలన్ ఎవరు అనే విషయాన్ని కనిపెట్టడానికి, చెప్పడానికి ప్రయత్నించి యూనిట్ సభ్యులందరూ విఫలమయ్యారు. ఆ సీక్రెట్ అలానే కొనసాగించి ప్రేక్షకులనే కాకుండా చిత్రయూనిట్‌ను కూడా థ్రిల్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. మేము క్లైమాక్స్ షూట్ చేస్తుండగా.. యూనిట్ సభ్యులు ఏం జరుగుతున్నదనే ఆసక్తితో కుర్చీలోంచి లేచి చూశారు అని దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెలిపారు.

Recommended Video

షాకింగ్ Fact About The Annual ఇన్ కమ్ Of Keerthy Suresh
కార్తీక్ సుబ్బరాజు సొంత బ్యానర్‌పై

కార్తీక్ సుబ్బరాజు సొంత బ్యానర్‌పై

పెంగ్విన్ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తన సొంత బ్యానర్‌ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌పై తెరకెక్కించారు. ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం, సుధాన్ సుందరం, ప్యాషన్ స్టూడియోస్ జయరాం నిర్మించారు. ఈ సినిమాను ఏకకాలంలో తెలుగు, తమిళంలో షూట్ చేయడం గమనార్హం. ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో జూన్ 19న రిలీజ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X