#69 Samskar Colony.. ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా.. నిర్మాత బాపిరాజు
లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం "#69 సంస్కార్ కాలనీ . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 18న విడుదలకు సిద్ధమైంది. మధుర మ్యూజిక్ లో విడుదలైన పాటలు, ట్రైలర్స్ కి అనూహ్య స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో 100 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్ లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 18న 300 థియేటర్స్‌లో ఈ చిత్రం రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత బాపిరాజు మీడియాతో మాట్లాడారు.
ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రలో #69 సంస్కార్ కాలనీ చిత్రం రూపొందింది. మార్చి 18న తెలుగు రాష్ట్రాల్లో 300కిపైగా థియేటర్స్ విడుదల అవుతుంది. మేము విడుదల చేసిన ట్రైలర్స్‌కు, పాటలకు, సోషల్ మీడియాలో 100 మిలియన్ పైగా వ్యూస్ రావడం, అనూహ్య స్పందన లభిచండంతో సంతోషంగా ఉంది అని నిర్మాత బాపి రాజు అన్నారు.

#69 సంస్కార్ కాలనీ సినిమాకు ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూటర్స్ వర్గాల నుంచి, మధుర ఆడియో లో విడుదలైన పాటలకి మంచి స్పందన వచ్చింది, ప్రవీణ్ ఇమ్మడి సంగీతం, గమన్ శ్రీ ,యక్కలి రవీంద్రబాబు గార్ల సాహిత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎస్ వి శివరాం సినిమాటోగ్రఫి గొప్పతనం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది అని బాపి రాజు అన్నారు.
ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు గురించి అందమైన కథతో రొమాంటిక్ సన్నివేశాలతో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చాలా గొప్పగా చెప్పారు. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తుంది. యూత్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది. ఎస్తర్ గారు పోషించిన వైశాలి పాత్ర ప్రేక్షకులని మేపిస్తుంది అని ఆశిస్తున్నాను. మా సినిమా ప్రతి ఒక్కరు చూడాలి" అని కోరుకున్నారు.
నటీ నటులు: ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్, భద్రం, శిల్పా నాయక్, రామన్, ఎఫ్ఎం బాబాయ్, సముద్రం వెంకటేష్ తదితరులు
డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : పి.సునీల్ కుమార్ రెడ్డి
ప్రొడ్యూసర్స్: బీ బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ
కథ: గాయత్రీ స్వాతి మంత్రిప్రగడ
మ్యూజిక్: ప్రవీణ్ ఇమ్మడి
డివోపి: ఎస్ వి శివరాం
ఎడిటర్: కృష్ణ మండల
లిరిక్స్: గమన్ శ్రీ ,యక్కలి రవీంద్రబాబు
సింగర్స్: ఎస్తర్, శ్రీ ప్రసన్న , శ్రీనివాస్ యాదవ్
విఎఫ్ఎక్స్: శ్యామ్ కుమార్ పి
కలరిస్ట్: పురుషోత్తం
సౌండ్ ఇంజనీర్: విష్ణువర్ధన్ కాగిత
పీఆర్వో: పాల్ పవన్
బ్యానర్ : లక్ష్మీ పిక్చర్స్


Click it and Unblock the Notifications











