హరికృష్ణ, నాగబాబులకు గుర్తింపు లేదు ... త్యాగాలేమో వీళ్లవి, ఈటీవీ ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్

తెలుగు బుల్లితెరపై దశాబ్ధాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈటీవీ ప్రభాకర్ . ఏళ్లుగా ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌లో , సినిమాలలో నటిస్తూ బుల్లితెర మెగాస్టార్ అనిపించుకున్నారు. తనకు నటుడిగా జీవితాన్ని, గుర్తింపును ఇచ్చిన ఈటీవీనే ఇంటిపేరుగా మార్చుకున్నారాయన. ప్రభాకర్ అంటే ఎవరికీ గుర్తు రాకపోవచ్చును కానీ ఈటీవీ ప్రభాకర్ అంటే ఎవరికైనా గుర్తొస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా, నందమూరి కుటుంబాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో టెలివిజన్ రంగం అప్పుడప్పుడే కుదురుకుంటున్న దశలో ఈటీవీలో అడుగుపెట్టారు ప్రభాకర్. దివంగత ఈనాడు గ్రూపు సంస్ధల అధినేత రామోజీరావు కుమారుడు సుమన్ , ప్రభాకర్ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన తండ్రి మాట కంటే ప్రభాకర్‌కే సుమన్ ఎక్కువ విలువనిచ్చే వారని ఇప్పటికీ ఈనాడు వర్గాల్లో చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈటీవీ నిర్వహణలో ప్రభాకర్ జోక్యం చేసుకున్నారనే వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి. ఈ క్రమంలోనే పెద్దాయన ఆగ్రహానికి ప్రభాకర్ గురయ్యారని .. అందుకే ఈటీవీ నుంచి ఆయనను తప్పించారని ఇప్పటికీ కథకథలుగా చెప్పుకుంటారు.

Etv Prabhakar made sensational comments on konidela nagababu and nandamuri harikrishna

ఈటీవీ నుంచి తప్పుకున్నా .. జెమినీ, మాటీవీ, జీ తెలుగు వంటి సంస్థలలో ప్రభాకర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పటికీ నటిస్తున్నారు. తన కొడుకు చంద్రహాస్‌ని కూడా నటన వైపు తీసుకొచ్చిన ప్రభాకర్ .. బుల్లితెర వైపు కాకుండా నేరుగా వెండితెరపైనే దించారు. ఎలాగైనా కొడుక్కి బ్రేక్ ఇవ్వాలని ప్రభాకర్, మలైజాలు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సొంతంగా బ్యానర్ ఓపెన్ చేసి 'రామ్ నగర్ బన్నీ ' అనే సినిమా నిర్మించారు. శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. కానీ చంద్రహాస్ ప్రయత్నానికి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇటీవల పలు ఛానెల్స్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు ప్రభాకర్. . దేవర సినిమా రాకుంటే రామ్ నగర్ బన్నీకి మంచి రిజల్ట్ వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మెగా ఫ్యామిలీని ఎంతగానో ఇష్టపడే ప్రభాకర్ ఆ కుటుంబంపై ఈగ వాలనివ్వరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకు మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత బాగా ఇష్టమైన వ్యక్తి రామ్ చరణ్ అని తెలిపారు.

కానీ వీరందరి కంటే మించి నాగబాబు అంటే గౌరవం, అభిమానం అని చెప్పారు ప్రభాకర్. నాగబాబుకి తగిన గుర్తింపు రాలేదని కొందరు అంటూ ఉంటారని , కానీ మెగా ఫ్యామిలీకి ఆయన మూల స్తంభం లాంటి వారని, కుటుంబం జోలికి ఎవరైనా వస్తే మొదట స్పందించేది నాగబాబేనని ప్రభాకర్ తెలిపారు. తొలుత చిరంజీవి వెంట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట నడిచి అన్నదమ్ముల కోసం ఎన్నో త్యాగాలు చేశారని ప్రభాకర్ ప్రశంసించారు.

ఇక నందమూరి ఫ్యామిలీకి హరికృష్ణ కూడా బ్యాక్‌బోన్‌గా నిలిచారని చెప్పారు. చైతన్య రథసారథిగా వేల కిలోమీటర్ల దూరం ఆయన డ్రైవర్‌గా వ్యవహరించబట్టే ఎన్టీఆర్ ఆ వయసులో రాష్ట్రమంతా తిరగగలిగారని ప్రభాకర్ అన్నారు. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారని ఆయనకు ఎలాంటి గుర్తింపు రాలేదు అనడం సబబు కాదన్నారు. తన దృష్టిలో హరికృష్ణ, నాగబాబులు గొప్ప వ్యక్తులని ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X