twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోస్టల్ బ్యాలెట్లు పట్టుకుపోయారు.. రాత్రి గెలిచి తెల్లారి ఓడిపోయారు.. మోహన్ బాబుపై ఈటీవీ ప్రభాకర్ సంచలనం

    |

    'మా' సంక్షేమం కోసం.. మా ప్యానెల్‌ అంతా రాజీనామా చేస్తున్నారని ప్రకాష్‌ రాజ్‌ ప్రకటించారు. మా ఎన్నికల్లో మా ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు.. మా రాజీనామాలు మంచు విష్ణు ఆమోదించాలని విజ్ఞప్తి చేసిన ఆయున అసోసియేష‌న్ లో మంచు విష్ణు ప‌నుల‌కు అడ్డు రాకూడ‌ద‌నే మా వాళ్ళు రాజీనామా చేశాన‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు. మీకు కావాల్సిన వాళ్లను పెట్టుకుని చాలా ఫ్రీగా మా సంక్షేమ కార్యక్రమాలు చేయాల‌ని మంచు విష్ణు టీంకు ప్రకాశ్‌రాజ్‌ సూచించారు. ఇక ఆ తర్వాత మాట్లాడిన కొందరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    ఆలోచించే ఈ నిర్ణయం

    ఆలోచించే ఈ నిర్ణయం


    ఈ టీవీ ప్రభాకర్ ప్రభాకర్ మాట్లాడుతూ మా పదవులకి మేము రాజీనామా చేస్తున్నామని అన్నారు. రెండు వర్గాలు అయిపోయాయి కాబట్టి రచ్చ అయ్యింది ఒకే ప్యానల్ వాళ్ళు ఉంటే ఇబ్బంది ఉండదని అన్నార. నరేష్.. మా వ్యతిరేక ప్యానల్ వాళ్ళు అడ్డుపడ్డారు అందుకే చేయలేదు గతంలో అన్నారని ఆ విషయం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక ప్రకాష్ రాజ్ ది నిజమైన విజయం అని ఆయన అన్నారు..

     బ్యాలెట్ తీసుకుని వెళ్ళిపోయాడు

    బ్యాలెట్ తీసుకుని వెళ్ళిపోయాడు

    ఎన్నికల అధికారి ..పోస్టల్ బ్యాలెట్ తీసుకుని వెళ్ళిపోయాడని, అదేంటని అడిగితే... నాకు హక్కు ఉంది అన్నాడని ఆయన అన్నారు. సగం రిజల్ట్ చెప్పి ఆపడం ఎక్కడ జరగదన్నా ఆయన నిన్న పోస్టల్ బ్యాలెట్ లెక్కపెట్టారని అన్నారు. బ్యాలెట్ తేడా ఉంటే అడిగామని కానీ అరగంటలో నే ఫిర్యాదు చేయాలని అన్నారు ఇదో కొత్త నిబంధన అని అన్నారు. ఇక శ్రీకాంత్ ఫిర్యాదు చేస్తే..ఎన్నికలు ఆగిపోతాయి అని ఎన్నికల అధికారి చెప్పారని, మళ్ళీ కోర్టుకు వెళ్తుందని మొదటికే మోసం వస్తుందని చెప్పారని అన్నారు.

    వీధిలో పడ్డాం

    వీధిలో పడ్డాం

    ఇప్పటికే వీధిలో పడ్డాం, ఇక వద్దు లే అనుకున్నాం కానీ విష్ణు ప్రవర్తన సరిగా లేదని అన్నారు. ఇక రాజీనామా తో విష్ణు ప్యానల్ కి, మా సభ్యులకు మంచిది అనుకున్నవన్నీ చేయొచ్చని అన్నారు. ఇక వాళ్ళు రెచ్చకొడుతున్నా ప్రకాష్ రాజ్ మాట్లాడకపోవడం చూసి ప్రకాష్ రాజ్ మీద అప్పుడు కోపం వచ్చింది కానీ హ్యాట్సాఫ్ అని అన్నారు.

    ఆయన కాబట్టి ఉరుకున్నాడు

    ఆయన కాబట్టి ఉరుకున్నాడు

    ఇక మోహన్ బాబు మాట్లాడే బూతులు ప్రకాష్ రాజ్ కాబట్టి ఊరుకున్నాడని, నేనైతే ఏమయ్యేదో అని ఆయన అన్నారు. ఇక మంచు విష్ణు, మనోజ్ లేకుంటే... ఎన్నికల రోజు రచ్చ అయ్యేది . కొట్టుకుని సచ్చే వాళ్ళని ఆయన అన్నారు. ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే ఘోరంగా జరిగాయన్నా ఆయన విష్ణు పోటీ చేసినట్టు అనిపించలేదు మోహన్ బాబు, నరేష్ పోటీ చేస్తే విష్ణు, మనోజ్ హెల్ప్ చేసినట్టు అనిపించిందని అన్నారు.

    Recommended Video

    Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
    రక్తం జరిగిపోయింది

    రక్తం జరిగిపోయింది

    ఎలక్షన్ రోజున బెనర్జీ అన్న కళ్ళలో నీళ్ళు చూసి రక్తం మరిగిపోయిందన్నా ప్రభాకర్ అవతల తండ్రి లాంటి వ్యక్తి అలా అనడంతో ఏం చేయలేకపోయానని అన్నారు. ఇండస్ట్రీలో ఎదురు మాట్లాడితే తొక్కేస్తారని, 20 ఏళ్లు వెనక్కి వెళ్తామని, కొండను ఢీ కొట్టడం అంత ఈజీ కాదు కాబట్టే వదిలేశామని అన్నారు. నేను, నా పిల్లలు ఇండస్ట్రీలోనే ఉన్నారని ఆయన అన్నారు.

    English summary
    ETV Prabhakar made some sensational allegations On Mohan Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X