twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ముప్పు ఉంది.. హెచ్‌డీ వీడియోలను ప్రసారం చెయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌ను కోరిన ఈయూ

    |

    ప్రపంచాన్ని కరోనావైరస్ వెంటాడుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సదుపాయాలు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అత్యంత ప్రజాదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్‌తోపాటు ఇతర స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లను యూరోపియన్ యూనియన్ రిక్వెస్ట్ చేసింది. తమ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌పై హై డిఫినేషన్ వీడియోలను ప్రసారం చేయకూడదని, దాంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందనే ఆందోళనను వ్యక్తం చేసింది.

    కరోనావైరస్ ఎఫెక్ట్ వల్ల ఎన్నో దేశాలు పలు కార్య నిర్వాహక శాఖలను మూసివేస్తున్నది. కోట్లాదిమంది ఇంటి నుంచి పనిచేస్తూ సేవలందిస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థులు స్కూళ్లకు దూరం అయ్యారు. కాబట్టి ఇంటర్నెట్ సేవలు చాలా అవసరమయ్యాయి. కావున బ్యాండ్‌‌విడ్త్‌పై ప్రభావం పడి ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కాకుండా చూడాలని నెటిఫ్లిక్స్‌తో సహ పలు కంపెనీలను కోరింది.

    European Union urges Netflix to stop HD Videos during Corona Effect on Globe

    ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హ్యాస్టింగ్‌తో యూరోపియన్ యూనియన్ కమిషనర్ థియర్రీ బ్రెటన్ సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ ఆవశ్యకత, వినియోగం గురించి చర్చించాను. అందరికీ మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించడానికి ప్రయత్నిద్దాం. అవసరం లేని సమయంలో హెచ్‌డీ వీడియోలను ప్రసారం చేయకుండా కట్టడి తీసుకోవాలని రీడ్‌కు సూచించినట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రజలను, కంపెనీలను హెడీ వీడియోలు ప్లే చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    విపత్కర పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ను సరైన రీతిలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది. బ్రెటన్ చోరవ తీసుకోవడం చాలా అభినందనీయం. మా వంతుగా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం అని నెట్ ఫ్లిక్స్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

    కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. దాంతో ఫేస్‌బుక్ సేవల్లో వినియోగం భారీగా పెరిగింది. ఈ వైరస్ గురించి తెలుసుకోవడానికి చెప్పడానికి ఎక్కువ మంది ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు అని కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు.

    English summary
    European Union urges Netflix to stop HD Videos during Corona's heavy Effect on Globe. EU Commissioner Breton called on people and companies to "#SwitchtoStandard definition when HD is not necessary.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X